Bhaag Saale:‘భాగ్ సాలే’ టీమ్‌కు మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ విషెష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhaag Saale:‘మత్తు వదలరా’ వంటి వినూత్న కథతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తొలి సక్సెస్ అందుకున్నాడు శ్రీసింహా. యంగ్ టాలెంటెడ్ పీపుల్ అంతా కలిసి చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే సందడి చేసింది. ఆ తర్వాత అదే స్పీడ్‌తో శ్రీసింహా ‘తెల్లవారితే గురువారం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ రొడ్డ కథ కావడంతో ప్రేక్షకులు వద్దు పో అన్నారు. విడుదలైన రెండు వారాల్లోనే ఆహాలో సందడి చేసి అక్కడ కూడా ప్లాప్ అయింది. ఆ తర్వాత ‘దొంగలున్నారు జాగ్రత్త’ వంటి సర్వైవల్ థ్రిల్లర్‌తో వచ్చి మరో ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు శ్రీసింహా. ప్రస్తుతం అతడి ఆశలన్నీ తన తదుపరి సినిమా భాగ్ సాలే పైనే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ట్రైలర్‌తోనే మేకర్స్ సినిమాపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అనంతరం శ్రీసింహా హీరోగా, నేహా సోలంకి నాయికగా భాగ్ సాలేలో నటిస్తున్నారు. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాను వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న భాగ్ సాలే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే చిత్ర బృందానికి మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ విషెష్ చెప్పారు. సినిమా ట్రైలర్ చూసి బాగుందని ప్రశంసించారు.
Also Read
Read Also:IND vs IRE Schedule 2023: ఐర్లాండ్‌తో భారత్ టీ20 సిరీస్.. షెడ్యూల్ ఇదే!
MEGASTAR @KChiruTweets garu gave his best wishes to the Young team of #BhaagSaale 🤩
ICYM Trailerhttps://t.co/qkd79m8mjJ
Don't miss it it in theatres from July 7th💥@Simhakoduri23 @NehaSolanki_ @IamPranithB @kaalabhairava7 @arjundasyan @VCWOfficial @YashBigBen… pic.twitter.com/rSTZaZYzsD
— BA Raju's Team (@baraju_SuperHit) June 28, 2023
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – భాగ్ సాలే సినిమా ట్రైలర్ బాగుంది. శ్రీసింహా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. కామెడీ, మాస్, ఎంటర్ టైనింగ్ తో పాటు క్రైమ్ అంశాలతో సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకుంటున్నాడు. శ్రీసింహా కీరవాణి గారి అబ్బాయి అని అతను హీరోగా పేరు తెచ్చుకునే దాకా నాకు తెలియదు. వారసుడిగా కాకుండా తను స్వతహాగా ఎదగాలని కష్టపడుతున్నాడు. కీరవాణికి పేరు తెచ్చేంతగా గుర్తింపు సంపాదించుకోవాలని కోరుకుంటున్నా. అలాగే కాలభైరవ అంటే చరణ్ కు చాలా ఇష్టం. వీరిద్దరు మత్తు వదలరా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపైనా మంచి అవకాశాలతో తమ ప్రతిభను చాటుకోవాలి. దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండంగా ఈ సినిమాను రూపొందించాడు. అలాగే నిర్మాత అర్జున్ దాస్యన్ మంచి ప్రయత్నం చేశాడు. ఈ సినిమా జూలై 7న విడుదలవుతోంది. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
Read Also:Etela Rajender: హుజూరాబాద్ లో ఒక సైకో ఎమ్మెల్సీ ఉన్నాడు.. ఈటల హాట్ కామెంట్స్
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్‌లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!