Live-In Partner: చట్టబద్ధంగా వివాహం చేసుకోని మహిళ తాను రిలేషన్‌లో ఉంటున్న వ్యక్తిని భర్తగా భావించి క్రూరత్వం కింద ఐపీసీ సెక్షన్ 498 ఏ కింద కేసు పెట్టలేమని కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఫిర్యాదు చేసిన మహిళ లివ్ ఇన్ పార్ట్‌నర్‌గా ఉన్న వ్యక్తిపై విచారణను రద్దు చేస్తూ గురువారం తీర్పు చెప్పింది. ‘‘ ఐపీసీ సెక్షన్ 498ఏ కింద శిక్షార్హమైన నేరం పెట్టడానికి, అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే, స్త్రీ ఆమె భర్త లేదా అతని బంధువులు క్రూరత్వానికి గురిచేయడం. భర్త లేదా హబ్బీ అనే పదం వివాహితుడైన పురుషుడు, వివాహంలో స్త్రీ యొక్క భాగస్వామి, ఒక వ్యక్తిని భర్త స్థితిలోకి తీసుకెళ్లేది వివాహము. ఐపీసీ సెక్షన్ 498 ఏ కింద సదరు వ్యక్తి మహిళ లివ్ ఇన్ పార్ట్‌నర్ అయితే అతను భర్త అనే పదానికి లోబడి ఉండదు’’ అని కోర్టు స్పష్టం చేసింది.
Read Also: Raj Tarun Case: పవన్ కళ్యాణ్ ఆఫీసుకు రాజ్ తరుణ్ లవర్.. భార్యలను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు
2023 మార్చి నుంచి 2023 ఆగస్టు వరకు తాము లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న సమయంలో తన భాగస్వామి మానసికంగా, శారీరంగా వేధించాడని మహిళ ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన కేరళ హైకోర్టు భర్త అనే పదానికి నిర్వచనాన్ని చెబుతూనే, లివ్ ఇన్ పార్ట్‌నర్‌ని భర్తగా చూడలేమని చెప్పింబది. సెక్షన్ 498A కింద నేరాన్ని ఆకర్షించాలంటే, భర్త లేదా భర్త బంధువులు క్రూరత్వానికి పాల్పడాలని కోర్టు సూచించింది. చట్టబద్ధమైన వివాహం లేకుండా స్త్రీ భాగస్వామిని సెక్షన్ 498 ఏ క్రూరత్వం కింద ప్రాసిక్యూట్ చేయలేమని చెప్పింది.