JR NTR : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి తీస్తున్న మూవీ వార్-2. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన వార్ సినిమాకు సీక్వెల్ గా రాబోతోంది. ఆగస్టు 14న వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కు సంబంధించి క్రేజ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ త్వరలోనే రిలీజ్ చేస్తున్నారంట. దాంతో పాటు ఈ సినిమాలో ఎన్టీఆర్ షర్ట్ లెస్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఆయన షర్ట్ లెస్ యాక్షన్ సీన్ చేస్తున్నారంట.
Read Also : War 2 : ‘వార్ 2’ మూవీ ఫస్ట్ లుక్ పై ఇంట్రెస్టింగ్ బజ్.. !
ఇంట్రడక్షన్ సీన్ లో 10 నుంచి 20 నిముషాల దాకా యాక్షన్ సీన్ లో షర్ట్ లేకుండా ఎండలో ఎన్టీఆర్ ఫైట్ చేయబోతున్నట్టు సమాచారం. ఇందులో కండలు తిరిగిన బాడీతో ఎన్టీఆర్ ఇలా మాస్ ఫైట్ లో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ గతంలో టెంపర్ సినిమాలో ఇలా షర్ట్ లేకుండా నటించాడు. ఇప్పుడు ఈ సినిమాలో మళ్లీ అలా కనిపించబోతుండటంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లు మొదలు పెట్టాలని మూవీ భావిస్తోంది. సాంగ్స్, ఫస్ట్ లుక్, టీజర్ లతో రిలీజ్ డేట్ నాటికి పాన్ ఇండియా వైడ్ గా హైప్ పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారంట.