Rahul Gandhi: రిజర్వేషన్లపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుల అధారిత రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తుందని, అవసరమైన మేరకు రిజర్వేషన్లు ఇస్తామని అన్నారు. దళిత, వెనకబడిన, గిరిజన వర్గాల ప్రజలకు రిజర్వేషన్ ప్రయోజనాలను పెంచుతుందని రాహుల్ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్ రత్లామ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో సోమవారం ఆయన ఈ ప్రకటన చేశారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
Read Also: Robot Dance: అరెరె.. ఈ రోబోలు బలే డాన్స్ చేసేతున్నాయిగా.. వీడియో వైరల్..
బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని ముగించాలని, మార్చాలని కోరుకుంటున్నాయని.. కాంగ్రెస్, ఇండియా కూటమి రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఈ రాజ్యాంగం మీకు జల్ (నీరు), జంగల్ (అడవి), జమీన్ (భూమి)పై హక్కులు కల్పించిందని, అయితే, ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని తొలగించేందుకు పూర్తి అధికారం కావాలని కోరుతున్నారని చెప్పారు. తాము గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు ప్రకటించారని ఆరోపించారు. అందుకే వారు 400 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, 400 మర్చిపోండీ, 150 సీట్లు కూడా రావని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.
90 మంది అధికారులు దేశాన్ని నడుపుతున్నారని, వీరిలో ఒకరు మాత్రమే ఆదివాసీ అని, ముగ్గురు వెనకబడిన తరగతులకు చెందిన వారని, ముగ్గురు దళిత వర్గాలనికి చెందిన వారని రాహుల్ గాంధీ చెప్పారు. మీ వర్గం ప్రజలు మీడియాలో, కార్పొరేట్‌లో లేరని మేము దీన్ని మార్చాలని అనుకుంటున్నామని అన్నారు. అందుకు మేము కులగణన, ఆర్థిక సర్వే చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రైతులకు ఎంఎస్పీ ఇవ్వడంతో పాటు రుణమాఫీ రూపంలో రైతులకు ఉపశమనం కల్పిస్తామని చెప్పారు.