Vaccination: 5-15 ఏళ్ల పిల్లలకు అప్పుడే.. కేంద్రం కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 15 ఏళ్లు పై బడిన వారందరికీ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది.. ఇక, 15 ఏళ్లు లోపు పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.. ఈ సారి 5 నుంచి 15 ఏళ్ల లోపు చిన్నారులకు కూడా టీకాలు వేయనున్నారు.. అయితే, దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ… కోవిడ్ టీకాలపై నిపుణుల బృందం సిఫారసు చేసిన వెంటనే వ్యాక్సిన్లు వేస్తామని తెలిపారు.. దీనిపై ఇప్పటి వరకు ఎక్స్‌పర్ట్ కమిటీ ఎలాంటి సిఫారసు చేయలేదని వెల్లడించారు.. సాధారణ బడ్జెట్‌పై బీజేపీ.. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహించిన ఓ కార్యాకమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ ఏజ్ గ్రూప్‌కు టీకాలు ఎప్పుడు వేయాలో శాస్త్రవేత్తల బృందం సిఫారసుల ఆధారంగానే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
Read Also: Jagga Reddy: సీఎంకి ఎంత మంది తండ్రులని మేం అడగాలా..?
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ వేయడంపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మన్సుఖ్ మాండవీయ.. ఈ వర్గానికి చెందిన టీకాపై నిపుణుల బృందం ఇప్పటి వరకు ఎలాంటి సిఫారసు చేయలేదని స్పష్టం చేశారు.. కాగా, దేశవ్యాప్తంగా 15-18 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ వేయడం గత నెలలో ప్రారంభమైన విషయం తెలిసిందే.. టీకాలు వేయడం సమస్య కాదు.. మా దగ్గర సరిపడా వ్యాక్సిన్‌లు ఉన్నాయి, డోస్‌ల కొరత లేదు.. కానీ, మేం ఖచ్చితంగా సైంటిఫిక్ కమ్యూనిటీ యొక్క సిఫార్సును అనుసరిస్తామని తెలిపారు మాండవీయ.. ప్రభుత్వానికి ఇంతవరకు ఎలాంటి సిఫారసు రాలేదని, దాని ఆధారంగానే రానున్న రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇది రాజకీయ నిర్ణయం కాదు.. గత ఏడాది జూలై-ఆగస్టులో సెరో సర్వే మరియు సెరో ప్రాబల్య సర్వేలో 67 శాతం మంది పిల్లలు కూడా యాంటీ బాడీలను అభివృద్ధి చేశారని ఆయన తెలిపారు. అంతిమంగా, శాస్త్రవేత్తలు సిఫార్సులు చేసే ముందు అధ్యయనం చేస్తారు. ఇంతకుముందు ప్రపంచ దేశాలను అనుసరించేవాళ్లం.. ఇప్పుడు మన శాస్త్రవేత్తలు వారి స్వంత విశ్లేషణను నిర్వహిస్తారు. వారి స్వంత అధ్యయనం కలిగి ఉన్నారని.. వాటి ఆధారంగా అభిప్రాయాలను రూపొందించారని వెల్లడించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!