Lok Sabha Election Results : భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. నేడు వెలుబడిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ స్థానం నుంచి TMC అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌధురిపై దాదాపు 70,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. యూసుఫ్ పఠాన్‌కు 4,58,831 ఓట్లు రాగా, రంజన్‌కు 3,89,729 ఓట్లు వచ్చాయి.…
తాజా వివాదంపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి స్పందించారు. తాను క్షమాపణ చెబుతానని.. తనను ఉరితీసినా తాను సిద్ధంగా ఉన్నానన్న ఆయన.. ఈ వివాదంలోకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. తాను పొరపాటుగా ఈ వ్యాఖ్యలు చేశానని.. రాష్ట్రపతిని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు.