ISRO: ఇస్రోను శాస్త్రవేత్తలు ఎందుకు వదిలేస్తున్నారు..? అసలు కారణాలు ఇవే..
- ఇస్రోను వీడుతున్న కీలక సైంటిస్టులు..
- కొన్ని నెలల్లోనే 100 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా..
- ప్రైవేట్ కంపెనీల విస్తరణ, అధిక జీతాలు, కెరీర్ ఎదుగుదలే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) బ్రెయిన్ డ్రెయిన్ సమస్యను ఎదుర్కొంటోంది. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో ఇస్రోను వీడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కీలకమైన అంతరిక్ష ప్రయోగాలకు ముందు సైంటిస్టులు వెళ్లిపోవడం సంచలనంగా మారింది. గత కొన్ని నెలల్లో 100 మందికి పైగా కీలకమైన శాస్త్రవేత్తలు రాజీనామా చేయడం, స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) తీసుకోవడం దేశాన్ని షాక్‌కు గురిచేస్తోంది. దీంతో కీలక ప్రాజెక్టుల్లో పనిచేసే శాస్త్రవేత్తల రాజీనామాలపై అంతరిక్ష శాఖ కొత్త ఆంక్షలను విధించింది. ముఖ్యంగా గగన్‌యాన్ వంటి జాతీయ ప్రాధాన్య ప్రాజెక్టుల్లో పనిచేసే సిబ్బంది రాజీనామాలకు ఇప్పటి నుంచి ప్రత్యేక అనుమతిని తప్పనిసరి చేసింది.
శాస్త్రవేత్తలు ఎందుకు వెళ్తున్నారు, కారణాలేంటి.?
ప్రైవేట్ సంస్థలు, బెటర్ సాలరీ:
శాస్త్రవేత్తలు వెళ్లిపోవడానికి చాలా కారణాలు ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2020లో భారత అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు కూడా తెరవడంతో స్కైరూల్ ఏరోస్పేస్, అగ్నికుట్ కాస్మోస్, ఫిక్సల్, ధ్రువ్ స్పేర్ వంటి స్టార్టప్స్ వేగంగా ఎదిగాయి. ఈ సంస్థలు ఇస్రోతో పోలిస్తే అధిక జీతాలు, స్టాక్ ఆఫ్షన్లు, వేగంగా కెరీర్ ఎదుగుదల, నాయకత్వ బాధ్యతలు, కొత్త టెక్నాలజీపై పని చేసే అవకాశం కలగడం వంటివి సైంటిస్టుల్ని ఆకర్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో చాలా మంది ప్రైవేట్ రంగాన్ని ఎంచుకుంటున్నారు.
Also Read
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
- Mohan Bhagwat: ‘భారత్‌లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ప్రయోగాల్లో ఆలస్యం:
ఇదే కాకుండా ఇస్రోలో కీలక మిషన్లు పదే పదే వాయిదా పడటం, ఆలస్యాలు శాస్త్రవేత్తల్ని నిరుత్సాహానికి గురిచేస్తు్న్నాయి. గగన్‌యాన్ జీ1, SSLV-L1, GSLV-F17,పరిశ్రమ నిర్మిత PSLV-N1 వంటి అనేక ప్రయోగాలను ప్రకటించారు. కానీ ఇవి ఇప్పటికీ జాప్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఎదురైన వైఫల్యాలకు సంబంధించిన అంచనాలను ఏజెన్సీ ఇంకా బహిరంగంగా విడుదల చేయలేదు. ఇస్రోలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ ఆలస్యం, కేంద్రీకృతం అవుతోందని చర్చ కూడా ఉంది.
పని విధానం:
నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తరహాలో ప్రాజెక్ట్ ఆధారిత నియామక విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని చాలా మంది భావిస్తున్నారు. దీని ద్వారా కీలకమైన నైపుణ్యాలను నేర్చుకోవడం, అవసరానికి అనుగుణంగా నిపుణుల్ని నియమించుకోవిడం, సంస్థకు మరింత సౌలభ్యం ఉంటుందని భావిస్తున్నారు.
ఇస్రో ముందున్న సవాల్ ఏంటి.?
ఇస్రోలో మొత్తం 14,600 మందికి పైగా ఉద్యోగులు ఉన్నప్పటికీ, రాజీనామా చేసిన వారిలో చాలా మంది చంద్రయాన్-3, SpaDeX, గగన్‌యాన్ వంటి కీలక మిషన్లలో పనిచేసిన అనుభవజ్ఞులు ఉన్నారు. వీరి స్థానాన్ని కొత్త రిక్రూట్మెంట్లతో భర్తీ చేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. భారత అంతరిక్ష రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతిభావంతుల్ని ఆకర్షించడమే కాకుండా, వారిని సంస్థలో ఉండేలా చేయడం ఇస్రోకు పెద్ద సవాల్‌గా మారింది.
తాజావార్తలు
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్‌లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!