Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Why Congress Prashant Kishor Talks Failed Again

Prashant Kishor: పీకే ఎందుకు నో చెప్పారు..?

Published Date :April 26, 2022 , 10:59 pm
By Sudhakar Ravula
Prashant Kishor: పీకే ఎందుకు నో చెప్పారు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

పార్టీలకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సపోర్టు ఉంటే చాలూ చక్రం తిప్పొచ్చు… విజయపథంలో ముందుకు పోవచ్చనుకుంటారందరూ. అయితే ఇప్పటివరకు సలహాదారుడిగా ఉన్న పీకే… తాను డీల్ చేసుకున్న పార్టీల గెలుపు కోసం వ్యూహాలకు పదును పెట్టారు. భారత రాజకీయాల్లో రాజకీయ సలహాదారుడిగా తనకు సాటిలేరన్న స్థాయికి ఎదిగారు పీకే. అయితే, ఇంతకాలం వెనుకుండి చక్రం తిప్పిన ఆయన.. కాంగ్రెస్‌లో చేరనున్నారన్న ప్రచారం జోరుగా జరిగింది. పార్టీలోకి పీకేను తీసుకోవాలనే నిర్ణయం దాదాపు ఫైనల్ అయింది. కాంగ్రెస్‌లో పీకే చేరికపై పెద్దఎత్తున సీనియర్ నాయకుల కమిటీ మల్లగుల్లాలు పట్టింది. ఫైనల్‌గా పీకే చేరికకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది.

Read Also: Drugs: కొకైన్ కడుపులో దాచిన కేటుగాడు.. ఆపరేషన్‌ చేసి స్వాధీనం

అయితే కాంగ్రెస్‌లో సీనియర్లందరూ ఒప్పుకున్నాక… పీకే ఒక్కసారిగా వెనకడుగు వేశారు. అయితే సలహాదారుడిగా పార్టీల్లో చక్రం తిప్పిన పీకే… తాను పార్టీ నాయకుడిగా మారితే.. ఎంతమేరకు సక్సెస్ ఉంటుందో ఆలస్యంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కింగ్ మేకర్‌గా ఉంటే పార్టీ సక్సెస్ అయితే క్రెడిట్ దక్కుతుంది. ఫెయిల్ అయితే లైట్ తీసుకోవచ్చు. ఈ పార్టీ కాకపోతే మరో పార్టీకి సర్వీస్ ఇయ్యొచ్చు. అదే నాయకుడిగా తాను చెప్పిన టార్గెట్‌ను పూర్తి చేయకపోతే… ఆ ఫెయిల్యూర్‌ను ఫేస్ చేయటం అంత ఈజీ కాదని పీకే భావించినట్లుగా చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి పార్టీకి సలహాదారుడిగా ఉంటే అధ్యక్షుడి ద్వారా తన వ్యూహాలను అమలు చేయొచ్చు పీకే. కానీ పార్టీలో ఏ స్థానంలో ఉన్నా… ఆ ఎఫెక్ట్ మరోలా ఉంటుంది. పార్టీ నాయకుడిగా ఆయన ఇచ్చే సలహాలు, సూచనలను అందరూ ఫాలో కాకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో అసలే ప్రజాస్వామ్యం ఎక్కువ. ఏకంగా పార్టీ అధ్యక్షులపైనే ఆరోపణలు చేసే నాయకులెందరో కాంగ్రెస్‌లో ఉన్నారు. అలాంటి నాయకులతో ప్రశాంత్ కిషోర్ మనగలరా..? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో అన్నీ తట్టుకుని 2024 దాకా అందులో ఉంటే… ఆయన అనుకున్న లక్ష్యం అందుకుంటారా? అదే జరగకపోతే.. అప్పుడు అందరూ ఎవరిని నిందిస్తారు? వారందరికీ ప్రశాంత్‌ కిషోర్‌ను టార్గెట్‌ అవుతారా? ఇలా అనేక అంశాలపై ఆలోచించాకే.. ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌లో చేరికపై వెనక్కి తగ్గారని సమాచారం. అన్ని అంశాలను బేరీజు వేసుకున్నాక.. కింగ్ అవటంకన్నా, కింగ్ మేకర్‌గా ఉండాలనుకుని… రాజకీయ పార్టీలకు సలహాదారుడిగానే ఫిక్సయ్యారట ప్రశాంత్ కిషోర్. మొత్తంమీద, ఈ వారం రోజులుగా దేశ రాజకీయ వార్తల్లో పీకే ఫుల్ పాపులర్ అయ్యారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • prashant kishor

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions