WHO warns: భారత్‌లో పెరిగిపోయిన బద్ధకస్తులు.. డబ్ల్యూహెచ్‌వో సీరియస్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొందరు కూర్చున్న వద్దనే అన్నీ రావాలి.. కనీసం అక్కడే ఉన్న టీవీ రిమోట్ తీసుకోవడానికి కూడా బద్ధకమే.. ఎక్కడో వేరేచోట పనిలో ఉన్నవారిని పిలిచి మరి పనిచేయించుకుంటారు.. అంటే వారు కదలలేని స్థితిలో ఉన్నారు అంటే అదీ కాదు.. కానీ, లేచేందుకే బద్ధకం.. ఇలా పనులను వాయిదా వేసేవారు, శరీరానికి కనీసమైన వ్యాయామం చేయకుండా.. బద్ధకించేవారు.. ఇలా ఎంతో మంది ఉన్నారు.. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన ఫిజికల్ యాక్టివిటీపై గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ 2022 ప్రకారం.. భారత్‌లో బద్ధకస్తుల సంఖ్య పెరిగిపోయింది.. ప్రపంచవ్యాప్తంగా 2020 – 2030 మధ్య కాలంలో దాదాపు 500 మిలియన్ల మంది గుండె జబ్బులు, స్థూలకాయం, మధుమేహం, ఇతర నాన్‌కమ్యూనికేబుల్ వ్యాధుల భారినపడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరికలు జారీ చేసింది.. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వాలు ప్రజల్లో మరింత శారీరక శ్రమను ప్రోత్సహించడానికి తక్షణ చర్యలకు ఉపక్రమించాలని.. లేకపోతే ఏడాదికి 27 బిలియన్ డాలర్లు వ్యయం అవుతుందని పేర్కొంది.. అన్ని వయసులు, సామర్థ్యాలలో శారీరక శ్రమను పెంచడానికి ప్రభుత్వాలు ఎంత మేరకు సిఫార్సులను అమలు చేస్తున్నాయో అనేది ఈ సర్వే పేర్కొంది.
Read Also: Diwali Special: దీపావళి ఎలా వచ్చింది..? ఏమిటా కథ..?
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
బద్ధకాన్ని పారద్రోలేందుకు కొన్ని సూచలను చేసింది ఆ నివేదిక.. మొత్తం 194 దేశాల నుంచి వచ్చిన డేటా ప్రకారం పురోగతి నెమ్మదిగా ఉందని, శారీరక శ్రమ స్థాయిలను పెంచడానికి, తద్వారా వ్యాధి నిరోధకశక్తిని పెంచడానికి.. ఇప్పటికే ఉన్న ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై దృష్టి కేంద్రీకరించి వాటిని అమలు చేసేందుకు ఆయా దేశాలు వెనువెంటనే చర్యలు తీసుకోవాలని నివేదిక వెల్లడించింది. 50 శాతంకంటే తక్కువ దేశాల్లో ప్రజల శారీరక శ్రమ విధానాన్ని కలిగి ఉన్నాయని, అందులో 40శాతం కంటే తక్కువ దేశాలు పనిచేస్తున్నాయని నివేదిక తెలిపింది. 30 శాతం దేశాలు మాత్రమే అన్ని వయసుల వారికి జాతీయ శారీరక శ్రమ మార్గదర్శకాలను అందిస్తున్నాయని పేర్కొంది.. నడక, సైకిల్ తొక్కడం, క్రీడలు, ఇతర శారీరక శ్రమల ద్వారా ప్రజలు మరింత చురుగ్గా ఉండేలా కృషి చేయాలని నివేదించింది..
ఆ నివేదిక ప్రకారం భారత్‌లో బద్ధకస్తుల సంఖ్య పెరిగిపోయింది.. శారీరక శ్రమకు దూరంగా ఉండడంతో పలు దీర్ఘకాలిక వ్యాధుల భారిన పడుతున్నట్లు ఆ నివేదిక పేర్కొంది.. భారత్‌లో 11-17 మధ్య వయస్సు వారిలో 74శాతం మంది అసలు శారీరక శ్రమ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.. అందులో బాలురు 72శాతం, బాలికలు 76శాతంగా ఉండగా.. ఇక, 18ఏళ్లు పైబడినవారిలో మహిళలు 44శాతం, పురుషులు 25శాతం వ్యాయామం చేయడం లేదని పేర్కొంది.. మరోవైపు.. 70 ఏళ్లు పైబడిన వారిలో మహిళలు 60శాతం, పురుషులు 38శాతం శారీరక శ్రమ చేయడం లేదని.. దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు… వీటిని నయం చేసుకునేందుకు క్రమంగా ఖర్చు పెరిగిపోతోంది.. దేశంలోనే ఏడాదికి రూ.25,600 కోట్లు ఖర్చు అవుతోందని.. అంతేకాదు.. వచ్చే పదేళ్లలో అది రెండు లక్షలకోట్లకు పెరిగే అవకాశం ఉందని ఆ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.. ఇదే సమయంలో.. దీర్ఘకాలిక వ్యాధుల భారిన పడకుండా ఉండేలాంటే కొన్ని కీలక సూచనలు చేసింది.. మానసిక రోగాల కేసుల్లో 43శాతం మేర వ్యాయామం లేకపోవటమే కారణంగా తేలిందని.. నడకకు అనువైన రహదారుల వ్యవస్థను నెలకొల్పాల్సిన అవసరం ఉందని తెలిపింది.. వాహనాల వేగంపై నియంత్రణ పెంచడం.., డ్రంక్ అండ్ డ్రైవ్ నిరోధించడం.. మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపడం నియంత్రించాలని.. ఇక, శారీరక శ్రమ చేయాలని ప్రోత్సహించే వ్యవస్థ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచే ఉండాలని.. ప్రతీ ఒక్కరికీ వారానికి 300 నిమిషాలు వ్యాయామం తప్పనిసరి అని ఆ నివేదిక స్పష్టం చేసింది.. 18ఏళ్లు పైబడిన వారు వారానికి 150 నుంచి 300 మధ్యస్థ శారీరక శ్రమ చేయాలని.. 11-17మధ్య వయస్సున్న పిల్లలు రోజుకు గంట శారీరక శ్రమ చేయాలని.. 18ఏళ్లు పైబడిన వారు కనీసం వారానికి రెండుసార్లు కండరాలు బలపడే వ్యాయామాలు చేస్తుండాలని.. 50 ఏళ్లు పైబడిన వారు వారానికి మూడు సార్లు బ్యాలెన్స్ ఎక్సర్ సైజ్ లు చేయాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన ఫిజికల్ యాక్టివిటీపై గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ 2022 నివేదిక స్పష్టం చేసింది.. ఇంకా ఎందుకు ఆలస్యం.. బద్ధకాన్ని వీడుదాం.. రోగాలబారినపడకుండా.. మనల్ని మనమే కాపాడుకుందాం..
తాజావార్తలు
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్‌లో ఎప్పుడూ చూడలే..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!