* ఢిల్లీ: నేడు ఆరోరోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఐదు రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఉభయసభలు
* ఢిల్లీ: నేడు పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీల నేతల భేటీ.. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్డే ఆఫీసులో నేతల భేటీ.. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
* ఢిల్లీ: గవర్నర్‌పై తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. గవర్నర్ తమిళిసైపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం.. అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను అమోదించకుండా పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంలో రిట్ పిటిషన్ వేసిన ప్రభుత్వం.. బిల్లులను ఆమోదించేలా గవర్నర్ కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్
* ఢిల్లీ: నేటితో ముగియనున్న అరుణ్ రామచంద్ర పిళ్ళై ఈడీ కస్టడీ.. పిళ్ళైని తమ కస్టడీలో మాగంటి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ కవితతో కలిపి విచారించాలని స్పెషల్ కోర్టుకు గతంలో తెలిపిన ఈడీ.. పిళ్ళై వారం రోజుల కస్టడీ సమయంలో ఈడీ ముందు హాజరు కాని కవిత, మాగుంట శ్రీనివాస్ రెడ్డి.. నేడు పిళ్ళైని స్పెషల్ కోర్టులో హాజరుపర్చనున్న ఈడీ
* ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత సహా మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్.. ఈ రోజు విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు..
* విజయవాడ: నేడు అంగన్‌వాడీ వర్కర్ల మహా ధర్నా.. అన్ని ప్రాంతాల్లో ముందస్తు అరెస్టులు చేస్తున్న పోలీసులు
* విజయవాడ: GO-1 రద్దు చేయాలని నేడు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన టీడీపీ, వామపక్షాలు, విద్యార్థి సంఘాలు.. చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఎటువంటి అనుమతి లేదు.. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా వార్నింగ్
* అసెంబ్లీ: ఉదయం 9 గంటలకు సమావేశం కానున్న ఏపీ అసెంబ్లీ.. ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న శాసనసభ.. డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పై మూడో రోజు ఓటింగ్.. సభలో పది బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. కొనసాగనున్న విశాఖ జీఐఎస్ సదస్సు- పెట్టుబడులు -యువత -ఉద్యోగ అవకాశాలు అంశం పై స్వల్ప కాలిక చర్చ
* ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు.. నేడు వైసీపీ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్.. ఒక్క ఓటు కూడా ఇన్ వ్యాలిడ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న వైసీపీ.. ఈ రోజు సభకు అందరూ హాజరు కావాలని విప్ జారీ చేసిన వైసీపీ
* కామారెడ్డి : నేడు బాన్సువాడలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర.. నస్రులాబాద్ నుంచి యాత్ర ప్రారంభం.. బొమ్మంతపల్లి చౌరస్తా, కంశెట్టి పల్లి, నెమ్లి, అంకోల్ క్రాస్, అంకోల్ క్యాంపు, అంకోల్ న్యూ క్యాంపు మీదుగా దుర్కి చేరుకోనున్న యాత్ర
* ప్రకాశం : ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో యథావిథిగా స్పందన కార్యక్రమం..
* నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కలెక్టరేట్లు పోలీస్ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించనున్న అధికారులు.
* నేడు ఏలూరు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం
* ఏలూరు జిల్లా: నేడు ద్వారకా తిరుమల రానున్న నేపాల్ ఉపరాష్ట్రపతి పరమానందజ్ఞ..
* అనంతపురం : కలెక్టరేట్ లో ఇవాళ జరగాల్సిన స్పందన కార్యక్రమం రద్దు.
* నంద్యాల: బనగానపల్లె (మం) యాగంటి ఉమా మహేశ్వర స్వామి క్షేత్రంలో నేడు ప్రత్యేక పూజలు, బిల్వార్చన, స్వామి అమ్మవార్లకు మహా మంగళహారతి
* కడప: నేడు యధావిధిగా కడప కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం.