* ఢిల్లీ: నేడు ప్రధాని నరేంద్ర మోడీతో ఈజిప్టు అధ్యక్షుడు భేటీ.. వ్యవసాయం, వాణిజ్య రంగాల్లో సహకారంపై చర్చ
* ఢిల్లీ: నేడు పోలవరంపై సీడబ్ల్యూసీ సమావేశం.. కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో సాంకేతిక కమిటీ భేటీ.. హాజరుకానున్న ఏపీ, తెలంగాణ, ఒడిశా; మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అధికారులు
* ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పఠాన్ మూవీ విడుదల.. 100 దేశాల్లో విడుదల కానున్న మూవీ.. పఠాన్ మూవీకి 4.19 లక్షల అడ్వాన్స్ టికెట్లు బుకింగ్
* అమరావతి: డా. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ.. పశువులకు అంబులెన్స్ సేవలు మరింత విస్తృతం.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 240.69 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌ల ఏర్పాటు.. ఇవాళ రెండవ దశలో అంబులెన్స్‌లను ప్రారంభించనున్న సీఎం జగన్
* విశాఖ: నేడు నగరానికి రానున్న ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు రామ్‌మాధవ్.. ఆంధ్రప్రదేశ్ యంగ్ థింకర్స్ ఫోరం ఆధ్వర్యంలో “పార్టీషన్డ్ ఫ్రీడమ్” పుస్తకావిష్కరణ.
* విశాఖ: ఏఎస్ రాజా గ్రౌండ్‌లో ఓటర్ల చైతన్య మహాసభ.. ముఖ్యఅతిథిగా హాజరుకానున్న మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ.. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా సభ నిర్వహిస్తున్న “ఓటర్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ” సంస్థ
* అనకాపల్లి జిల్లా: నేడు నర్సీపట్నం, చోడవరం నియోజకవర్గాల్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పర్యటన.. నియోజకవర్గాల సమీక్ష, చోడవరంలో బహిరంగ సభలో పాల్గొననున్న వైవీ సుబ్బారెడ్డి
* విశాఖ: నేడు ఆంధ్రా యూనివర్సిటీకి రానున్న చినజీయర్ స్వామి… శక్తి స్థూపానికి భూమి పూజ.. విద్యార్థులతో కలిసి 108 ఔషధ మొక్కలు నాటనున్న చిన జీయర్ స్వామి.
* విశాఖ: తెన్నేటి పార్కులో సాగర తీర స్వచ్చత – బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్.. పాల్గొననున్న జిల్లా యంత్రంగం, ప్రజాప్రతినిధులు.
* విశాఖ: నేడు జాతీయ పర్యాటక దినోత్సవం.. ఆర్.కె.బీచ్ నుంచి పార్కు హోటల్ వరకు టూరిజం వాక్
* విశాఖ: నేడు పరిశ్రమల శాఖ ముఖ్య అధికారులతో మంత్రి అమర్నాథ్ సమీక్ష.. పాల్గొననున్న స్పెషల్ సీఎస్ కరికల్ వలెవన్, పరిశ్రమ శాఖ డైరక్టర్ సృజన
* విశాఖ: నేడు తెలుగు, సంస్కృత అకాడమీ, అధికార భాషా సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న మాతృభాషా చైతన్య సదస్సు.. పాల్గొననున్న తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి..
* నేడు కడపకు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ నాయుడు.. కడప అమీన్ పీర్ దర్గా, మరియాపురం చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు..
* ప్రకాశం : దోర్నాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..
* ప్రకాశం : ఒంగోలు విజయ నగర్ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి..
* విజయవాడ : నేడు ఇంద్రకీలాద్రికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. దుర్గమ్మను దర్శించుకోనున్న పవన్.. ఎన్నికల ప్రచార వాహనం వారాహికి ప్రత్యేక పూజలు చేయించనున్న జనసేనాని.. అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకోన్ను పవన్ కల్యాణ్
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు పొదలకూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* అనంతపురం: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రైవేటికరణను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట సీపీఐ -ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
* అనంతపురం : ఏపీకి ప్రత్యేకహోదా -విభజన హామీలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ.. హాజరుకానున్న సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శలు కె. రామకృష్ణ, శ్రీనివాసరావు.. ప్రత్యేకహోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్.
* శ్రీ సత్యసాయి : ఈనెల 26 హిందూపురంలో పర్యటించనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ.. చిన్నమార్కెట్ కూడలిలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొననున్న బాలకృష్ణ.
* తూర్పుగోదావరి జిల్లా : నేడు కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రివర్యులు దేవుసింహ్ చౌహాన్ రాజమండ్రి రాక.. కేంద్ర మంత్రి రెండు రోజుల పాటు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో పర్యటన..
* నేడు కడపకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. 27 నుండి చేపట్టబోయే యువగళం పాదయాత్ర కు ముందు సర్వమత ప్రార్థనలు చేయనున్న లోకేష్.. హైదరాబాద్ నుంచి విమానంలో సాయంత్రం కడపకు చేరుకోనున్న లోకేష్.. సాయంత్రం 5.10 గంటలకు దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, 5.40 గంటలకు కడప అమీన్ పీర్ దర్గాలో, తర్వాత మరియాపురంలోని రోమన్ కేథలిక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు. అనంతరం రోడ్డుమార్గంలో తిరుమలకు లోకేష్.
* బాపట్ల : నేడు అమృతలూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున…
*తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు.. హాజరుకానున్న మంత్రి రోజా..
* పల్నాడు: నేడు క్రోసూరు, అచ్చంపేట మండలాల్లో మంత్రుల పర్యటన.. అచ్చంపేటలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 1.85 కోట్లతో నిర్మించిన అదనపు గదులను ప్రారంభించనున్న మంత్రి విడదల రజిని, మేరుగ నాగార్జున ,అంబటి రాంబాబు తదితరులు
* ఆదిలాబాద్: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో కొనసాగుతున్న నాగోబా జాతర.. ఇవాళ భేతాల్ పూజ, మండగాజిలింగు పూజ నిర్వహించనున్న మెస్రం వంశీయులు.. నేటితో నాగోబా వద్ద ముగియనున్న మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు.. కొనసాగనున్న జాతర.
* బాసర సరస్వతి అమ్మవారి ఆలయం లో కొనసాగుతున్న వేడుకలు. రేపు అమ్మవారి జన్మ నక్షత్రం వసంత( శ్రీ పంచమి) వేడుకలు.. భారీ సంఖ్య లో తరలిరానున్న భక్తులు.