* తెలంగాణలో క్యాడర్ అలాట్‌మెంట్‌పై నేడు హైకోర్టు తీర్పు.. 11 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారుల అంశంపై హైకోర్టులో విచారణ.. 9 మంది ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులను ఏపీకి పంపడాన్ని ఆపేసిన క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం
* నేడు కర్నూలు జిల్లాలో గవర్నర్ బిశ్వభూషణ్ పర్యటన.. పాణ్యం మండలంలోని బలపనూరు విద్యార్థులతో గవర్నర్ ముఖాముఖి
* జీవో నంబర్ 1 పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. హైకోర్టు స్టే ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్
* కామారెడ్డి: నేడు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం.. మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు తీర్మానం, డిటిసిపి ఢిల్లీ కన్సల్టెన్సీ పై ప్రభుత్వానికి ఫిర్యాదు వంటి అంశాలే ఎజెండా.. కౌన్సిలర్ల వరుస రాజీనామాలు, ఎమ్మెల్యే ఇంటి ముట్టడి పిలుపుతో అత్యవసర సమావేశం ఏర్పాటుకు చేసిన మున్సిపల్ చైర్మన్ నిట్టూ జాహ్నవి
* కామారెడ్డి: మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రకటనతో నేటి ఆందోళనకు తాత్కాలిక బ్రేక్… ఎమ్మెల్యే ఇంటి ముట్టడి వాయిదా
* ప్రకాశం : పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులో మండల సచివాలయ కన్వీనర్ల సమావేశంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్.. త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష.. మేడపిలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి సురేష్
* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ వద్ద రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని ప్రారంభించనున్న కలెక్టర్ దినేష్ కుమార్..
* కడప: 41వ డివిజన్‌లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న డిఫ్యూటీ సీఎం అంజద్‌బాష
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు వెంకటాచల మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* తూర్పుగోదావరి జిల్లా : నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటన.. కొవ్వూరు టౌన్ పి.ఎం.ఎం.ఎం హైస్కూల్ నూతన క్లాస్ రూమ్స్ నిర్మాణానికి శంకుస్థాపన, కొవ్వూరు టౌన్ 19 వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి
* విశాఖ: నేడు, రేపు ఇన్ఫినిటీ వైజాగ్ సమ్మిట్ 2023.. 50 స్టార్ట్ అప్ లతో సమావేశం కానున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఐటీ ఉన్నతాధికారులు
* అనంతపురం : జగనన్న సచివాలయ మండల కన్వీనర్ల సమావేశం.. హాజరుకానున్న ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జెసిఎస్ రీజనల్ కోర్డినేటర్ చల్లా మధుసూదన్ .. జిల్లా వ్యాప్తంగా 46 మండల కన్వీనర్ల నియామకం.
* తిరుపతి : నేడు న్యాయస్థానాలలో ఖాళీగా ఉన్న 600 ఉద్యోగాల ఖాళీలకు పరీక్షలు
* పల్నాడు: నేడు చిలకలూరిపేట 34 వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి విడదల రజని…
* బాపట్ల: అమృతలూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున..
* కర్నూలు: నేడు పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, తెలంగాణ మాజీ పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి రాక.. నేడు కర్నూలు, నంద్యాలలో కాంగ్రెస్ సమావేశం
* నంద్యాల: మహానందిలో కామేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ , కుంకుమార్చనలు, సాయంత్రం పల్లకి సేవ
* పశ్చిమ గోదావరి జిల్లా: తాడేపల్లిగూడెంలో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ..