* అమరావతి: ఉన్నతాధికారుల బదిలీపై తుది కసరత్తు.. ఇవాళ ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు ఉండే ఛాన్స్.. ఇప్పటికే బదిలీల జాబితాను సిద్ధం చేసిన సీఎంవో.. 10 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు బదిలీ అయ్యే అవకాశం
* అమరావతి: ఇవాళ ఉదయం 11.30కి సచివాలయానికి సీఎం చంద్రబాబు.. ప్రభుత్వ పథకాలపై ప్రజాభిప్రాయం, పలు శాఖలపై సమీక్ష
* హైదరాబాద్: నేడు ఉదయం 10.30కి ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. రెండు రోజుల పాటు పర్యటన.. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం
* నెల్లూరు: నేడు బారాషహిద్ రొట్టెల పండుగలో పాల్గొననున్న మంత్రులు నారా లోకేష్, ఫరూక్
* హైదరాబాద్: నేడు గాంధీ భవన్ లో జరగాల్సిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం వాయిదా వేసినట్టు ప్రకటించిన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి.. ఈ నెల 10వ తేదీ ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో సమావేశం జరగనున్నట్టు వెల్లడి..
* నేడు ములుగు జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, సీతక్క పర్యటన.. వాజేడ్, వెంకటపూర్ మండలాల్లో మొక్కజొన్న రైతులకు సీడ్ కంపెనీ ఇచ్చిన నష్ట పరిహారం చెక్కులు అందజేయనున్న మంత్రులు.. మంగపేట మండలం లో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించనున్న మంత్రులు.
* నేడు ములుగు జిల్లా కేంద్రంలో నిరసన లకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్.. పోటీగా, బీఆరెస్ పదేళ్ల పాలనపై నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపు.. జిల్లాలో మంత్రివర్యుల పర్యటన నేపథ్యంలో నేడు కాంగ్రెస్ చేపట్టివలసిన నిరసన కార్యక్రమం రేపటికి వాయిదా.
* వరంగల్ జిల్లా: నేడు కేయూ 23వ స్నాతకోత్సవం.. హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. ముస్తాబైన క్యాంపస్ ఆడిటోరియం.. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన అధికారులు.. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:15 గంటల వరకు స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
* కామారెడ్డి : నేడు జిల్లాలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన.. జుక్కల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి..
* భద్రాద్రి: నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రులు తుమ్మల, సీతక్క.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
* నిర్మల్ జిల్లా: కడెం ప్రాజెక్టు కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు లోకి వరద.. ఇన్ ఫ్లో 4488 క్యూసెక్కులు.
* నేడు కరీంనగర్ జిల్లా కేంద్రం మరియు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో పర్యటించనున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ముదిరాజ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి..
* అమరావతి : ఇవాళ బెంగుళూరు నుంచి పులివెందులకు మాజీ సీఎం వైఎస్ జగన్.. రేపు వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయ లోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్న జగన్.. ఇవాళ సాయంత్రం 3.30 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి 5.15 గంటలకు
పులివెందుల లోని తన నివాసానికి చేరుకుంటారు.. రాత్రి కి పులివెందుల లోనే బస చేస్తారు..
* విశాఖ: నేడు అనకాపల్లి, విశాఖ జిల్లాలో మంత్రి పార్థసారథి పర్యటన.. మాడుగుల నియోజకవర్గంలో డిసిసిబి లోన్ల పంపిణీ, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాల్లో పాల్గొనున్న పార్థసారథి
* తిరుపతి: నేడు కలెక్టరెట్ లో జిల్లా అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష…
* నంద్యాల: కొలిమిగుండ్ల (మం) కల్వటాల రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ కి భూములు ఇచ్చిన రైతులు, సిపిఐ నాయకులతో నేడు సమావేశమై చర్చలు జరుపనున్న సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం.
* కర్నూలు: నేడు కోడుమూరులో వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం
* అనంతపురం : నేడు పామిడిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజానగరం నియోజకవర్గంలో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పర్యటన.. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్న ఎంపీ.. మధ్యాహ్నం మూడు గంటలకు కోరుకొండలో బిజెపి రాజానగరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న పురందేశ్వరి
* తిరుపతి: సత్యవేడు టిడిపికి కొత్త కో ఆర్డినేటర్ గా శంకర్ రెడ్డి.. నేడు పార్టీ శ్రేణులకు పరిచయం చేయానున్న అనగాని
* అనంతపురం : ఉరవకొండకు మంచి నీటిని అందించే పీఏబీఆర్ స్కీమ్‌ను ప్రారంభించనున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. కేంద్ర జల జీవన పథకం ద్వారా రూ.22.50 కోట్లు నిర్మించిన స్కీమును ప్రారంభించనున్న మంత్రి.
* అనంతపురం : నార్పల మండలం గుగుడు కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాల నేడు అగ్నిగుండ ప్రవేశం భారీగా తరలి వచ్చిన భక్తులు.
* నాగర్ కర్నూల్: నేడు అచ్చంపేట నియోజక వర్గం లో పర్యటించనున్న మంత్రులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు.. అమ్రాబాద్, మన్ననూరు మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు.. ఆదివాసీలకు (చెంచులకు) ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ