* ఐపీఎల్-19: నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్.. రాత్రి 7.30 గంటలకు గౌహతి వేదికగా మ్యాచ్
* నేటితో కేరళంలో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. 140 స్థానాలకు ఈనెల 9న పోలింగ్.. మే4 న ఫలితాలు.. చివరి రోజు ప్రచారాన్ని ఉధృతం చేసిన UDF, LDF, BJP
* తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు వర్షాలు.. నేడు, రేపు ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. ఉత్తర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం.. తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు, సూర్యపేట, MHBD, వరంగల్, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు
* అమరావతి: సాయంత్రం 4 గంటలకు అగ్నిమాపకశాఖ నూతన వాహనాలు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. ఆధునిక వాహనాలు, పరికరాలను స్వయంగా పరిశీలించనున్న సీఎం
* ఇవాళ కేరళంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రేవంత్.. ఉదయం 8.30 గంటలకు కోవలం నియోజకవర్గంలో రోడ్‌షో.. ఉదయం 10.30 గంటలకు మావెలికరలో రోడ్ షోలో పాల్గొననున్న ముఖ్యమంత్రి.. మధ్యాహ్నం 2 గంటలకు పతానపురం రోడ్‌షోలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి..
* నేడు హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టూర్
* కామారెడ్డి : నేడు జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం. జిల్లా కలెక్టర్ అధ్యక్షత న జరగనున్న సమావేశం.. హాజరుకానున్న ఎమ్మెల్యే రమణా రెడ్డి.
* అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు. వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
* అమరావతి: నేడు పెనమలూరు నియోజకవర్గం కానూరులో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన .. ఉదయం 10 గంటలకు ఏపీ గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ శిక్షణా సంస్థ భవనంను ప్రారంభించనున్న పవన్.. జల జీవన మిషన్ వర్క్ షాప్ లో పాల్గొనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
* అమరావతి: యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పనపై ఏపీ ప్రభుత్వం దృష్టి.. ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఇవాళ 11 గంటలకు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ల సమావేశం.. ఇప్పటికే ఐదు లక్షల ఉద్యోగాలకు సంబంధించి సిద్ధమైన ప్రణాళికలు, వచ్చే మూడు సంవత్సరాల్లో 15 లక్షలు ఉద్యోగాల కల్పన కోసం ఏపీ ప్రభుత్వం కసరత్తు..
* నంద్యాల: నేడు శ్రీశైలం శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం.. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు తొలి విడత సాత్వికబలిగా కొబ్బరి, నిమ్మ, గుమ్మడికాయలు సమర్పణ.. సాయంకాలం శ్రీస్వామివారికి అన్నాభిషేకం, శ్రీస్వామివారి ఆలయ ద్వారాలు మూసివేత.. సాయంత్రం అన్నం కుంభరాశిగా పోసి స్త్రీ వేషంలో ఆలయ ఉద్యోగి గోవింద్ అమ్మవారికి కుంభహారతి.. అమ్మవారికి తొమ్మిది రకాల పిండివంటలతో మహానివేదన.. కుంభహారతి అనంతరం రెండోవిడత సాత్వికబలిగా కొబ్బరి,గుమ్మడికాయలు సమర్పణ.. సాత్వికబలి ముగిసిన తర్వాత భక్తులను అమ్మవారి నిజారుప దర్శనానికి అనుమతి
* అమరావతి: ఇవాళ సాయంత్రం విజయవాడలో పర్యటించనున్న మంత్రి నారాయణ.. విజయవాడ ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా మూడు కీలక రోడ్ల విస్తరణకు శంకుస్థాపన చేయనున్న మంత్రి.. విజయవాడ ఈస్ట్, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో రోడ్ల విస్తరణ.. విజయవాడ నుంచి శివారు ప్రాంతాలకు ట్రాఫిక్ లేకుండా వెళ్లేలా సీఆర్డీఏ నిధులతో రోడ్ల విస్తరణ.. త్తం 105 కోట్లతో చేపడుతున్న పనులకు ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపనలు చేయనున్న మంత్రి నారాయణ
* అనంతపురం : సోమందేపల్లిలో పర్యటించనున్న మంత్రి సవిత. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి.
* అనంతపురం : వైఎస్సార్ సీపీ జిల్లా స్థాయి మహిళా విభాగం ఆత్మీయ సమావేశం. హాజరుకానున్న రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి.
* తిరుమల: 7 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,294 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 26,796 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.75 కోట్లు