* నైరుతి బంగాళాఖాతంలో మరింత బలహీనపడిన తీవ్ర వాయుగుండం… ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల పరిసర ప్రాంతాలలో వాయుగుండం.. చెన్నైకి తూర్పున 50 కి.మీ… నెల్లూరు నుంచి దక్షిణ-ఆగ్నేయంగా 170 కి.మీ. దూరంలో కేంద్రీకృతం.. ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా దాదాపు 35 కి.మీ.నెమ్మదిగా నైరుతి దిశగా పయనిస్తున్న వాయుగుండం.. రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఇవాళ మోస్తరు వర్షాలు… ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం…..
* ఇవాళ రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రేపు ప్రధాని మోడీతో భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని మోడీని ఆహ్వానించనున్న సీఎం రేవంత్ రెడ్డి
* హైదరాబాద్: నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, ఇన్‌ఛార్జ్ మీనాక్షి.. అనంతరం జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్
* తిరుమల: ఇవాళ ఈ డిప్ విధానంలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు కేటాయింపు.. ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న 24 లక్షల మంది భక్తులు.. మద్యహ్నం 2 గంటలకు ఈ డిప్ విధానంలో దర్శనం టోకెన్లు కేటాయింపు.. డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1వ తేదీల్లో దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే అనుమతించనున్న టిటిడి
* అల్లూరి సీతారామరాజు జిల్లా: నేటి నుంచి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(PLGA) వారోత్సవాలు… AOBలో హై టెన్షన్… ఏటా డిసెంబర్ 2 నుండి 8వరకు వారోత్సవాలలో మృతి చెందిన మావోయిస్టులకు నివాళులు అర్పిస్తున్న మావోయిస్టు పార్టీ… మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మరణం, మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత జరుగుతున్న వారోత్సవాలతో హై అలెర్ట్…
* అనంతపురం : గుంతకల్లు రూరల్ పరిధిలోని కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో నేటి నుంచి రెండు రోజులపాటు హనుమత్ వ్రతం ఉత్సవాలు ప్రారంభం..
* కాకినాడ: నేటి నుంచి అన్నవరం వసతి గదులు అద్దె పెంపు.. హరిహర సదన్ జనరల్ రూ.600 నుంచి రూ.800కి.. ఏసీ రూ.950 నుంచి 1500కి పెంపు.. ప్రకాశ్ సదన్ ఏసీ రూ.999 నుంచి రూ.1,260కి.. న్యూ సీసీ, ఓల్డ్ సీసీలలో పాత ధర రూ.500, పెరిగిన తర్వాత రూ.700
* పల్నాడు జిల్లా: సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళ జంట హత్యల కేసులో ముగ్గురు మైనర్ యువకుల అరెస్ట్ .. నేడు గుంటూరు జిల్లా కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. రాత్రి ఆలస్యం కావడంతో ఈరోజు 10గంటలకు గుంటూరు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు
* నంద్యాల: నేడు అరటి రైతుల సమస్యలపై మాజీ మంత్రి బుగ్గన ఆందోళన.. అరటి రైతులకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని ప్యాపిలి మండలంలో హుసేనాపురం నుండి డి.రంగాపురం వరకు పర్యటించనున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
* నిజమాబాద్ : నేటి తో ముగియనున్న రెండో విడత నామినేషన్లు.. నామినేషన్లకు చివరి రోజు కావడంతో నేడు నామినేషన్లు భారీగా వచ్చే అవకాశం… 196 సర్పంచ్ స్థానాలకు 578 నామినేషన్లు, 1760 వార్డు స్థానాలకు 1353 నామినేషన్లు
* తిరుమల: పరకామణి చోరీపై సీఐడీ విచారణ పూర్తి.. నేడు హైకోర్టుకు సీల్డ్ కవర్‌లో నివేదిక, కోర్టు ఆదేశాలతో 25 రోజుల్లో విచారణ
* తిరుమల: 8 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,345 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 24,292 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.43 కోట్లు
* శ్రీ సత్యసాయి : సోమందేపల్లి మండలం పాపిరెడ్డి పల్లి నుండి తొంగోడు వరకు 2.5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రోడ్డు పనులను ప్రారంభించనున్న మంత్రి సవిత.
* అనంతపురం : ఉరవకొండలో జరిగే ప్రజా దర్బార్ లో పాల్గొననున్న మంత్రి పయ్యావుల కేశవ్.