* అమరావతి: ఇవాళ రెండో రోజు కలెక్టర్ల సమావేశం.. ఆదాయార్జన శాఖలపై ప్రత్యేక సమీక్ష.. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం.. జిల్లాల వారీగా పరిస్థితికి సంబంధించి సమీక్ష.. సాయంత్రం కలెక్టర్ల సమావేశంలో శాంతి భద్రతలపై ప్రత్యేక చర్చ.. అన్ని జిల్లాల ఎస్పీలతో సీఎం చంద్రబాబు, డీజీపీ ప్రత్యేక సమీక్ష.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ నియంత్రణ… ఇతర అంశాలపై చర్చ
* అమరావతి: నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో వైఎస్ జగన్ భేటీ.. కోటి సంతకాల ప్రతులను గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందించనున్న జగన్
* హైదరాబాద్: నేడు బీజేపీ కార్యాలయాల ముందు నిరసనకు పిలుపునిచ్చిన కాంగ్రెస్.. మా కార్యాలయాల దగ్గరికి వస్తే ఊరుకునేది లేదని చెప్పిన బీజేపీ
* అమరావతి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల ఉద్యమం.. నేడు గవర్నర్‌ను కలవనున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. సాయంత్రం 4 గంటలకు లోక్ భవన్‌లో గవర్నర్‌కు కోటి సంతకాల పత్రాల అందజేత.. జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలతో కలిసి గవర్నర్‌కు వినతి
* అమరావతి: ఈ రోజు ఉదయం 10 గంటలకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి కోటి సంతకాల వాహనాల ర్యాలీ.. వాహనాలను జెండా ఊపి లోక్ భవన్‌కు పంపనున్న వైఎస్ జగన్.. కార్యక్రమంలో పాల్గొనున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు, రీజినల్ కో-ఆర్డినేటర్లు..
అమరావతి: ఉదయం 10 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు, రీజినల్ కో-ఆర్డినేటర్లు తో జగన్ కీలక సమావేశం
* విజయవాడ : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ (PPP)కు వ్యతిరేకంగా సీపీఐ ధర్నా.. ఉదయం 11 గంటలకు విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నా..
* బాపట్ల : బల్లికురవ మండలం వైదనలో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలలో పాల్గొననున్న మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్..
* తిరుమల: ఇవాళ నుంచి 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో మార్చి నెల దర్శన టిక్కెట్లు విడుదల.. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవలకు రిజిస్ట్రేషన్.. ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు లక్కిడిప్ విధానంలో ఆర్జిత సేవలు కేటాయింపు
* రాజమండ్రి: ఇవాళ ఉదయం 11 గంటలకు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్.. పోలవరం ప్రాజెక్టు, సాగునీటి కష్టాలపై మాట్లాడనున్న ఉండవల్లి.. ఇవాళ పోలవరం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న ఉండవల్లి
* తిరుమల: 27 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,389 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 24,956 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు
* నంద్యాల: నేడు మిడుతూరు మండలం చౌటుకూరులో మినీ గోకులం షెడ్డు ప్రారంభించనున్న ఎమ్మెల్యే జయసూర్య.. సీఎం సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేయనున్న ఎమ్మెల్యే జయసూర్య.
* నెల్లూరు: ఇవాళ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం.. ఇంఛార్జ్ మేయర్ గా వ్యవహరించనున్న రూప్ కుమార్ యాదవ్.. గోవా నుంచి తిరుపతికి చేరుకున్న 40 మంది కార్పొరేటర్లు .. మేయర్ స్రవంతి రాజీనామాను ఆమోదిస్తూ తీర్మానం చేయనున్న సభ్యులు.. ఇవాళ మేయర్ మీద అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన కౌన్సిల్ మీటింగ్ ఉండాల్సి ఉండగా.. ఆమె రాజీనామాతో సాధారణ సమావేశం జరగనుంది..
* పల్నాడు జిల్లా: నేడు ఏఎస్సై కొడుకు వెంకటనాయుడు గ్యాంగ్ ను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు. ఈ నెల 4న నాదెండ్ల మండలం గణపవరంలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతికి కారణమైన వెంకటనాయుడు గ్యాంగ్. ప్రస్తుతం నర్సరావుపేట సబ్ జైలులో రిమాండ్ లో ఉన్న గ్యాంగ్. ఐదు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు ఉత్తర్వులు.
* నేడు మెదక్ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. BRS పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న హరీష్ రావు
* ఖమ్మం: నేడు జిల్లాలో మంత్రులు తుమ్మల, పొంగులేటి పర్యటన..
* భద్రాద్రి: నేడు జిల్లాలో పర్యటించనున్న mlc కవిత
* హైదరాబాద్: ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. రవిని ప్రశ్నించనున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. నాలుగు కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీకి అనుమతించిన నాంపల్లి కోర్టు