* ఈ రోజు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు .. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ఉదయం 9 గంటల నుంచే వెల్లడికానున్న “ట్రెండ్స్”.. మధ్యాహ్నం వరకు ఫలితాలు దాదాపు స్పష్టం అయ్యే అవకాశం.. 38 జిల్లాల్లో, 243 అసెంబ్లీ స్థానాల్లో రెండు విడతల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు.. ఓట్ల లెక్కింపు కారణంగా బీహార్ లోని పాఠశాలలు, ఇతర విద్యాలయాలకు ఈరోజు సెలవు
* నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం.. బీహార్‌లో రెండు దశల్లో పూర్తయిన ఎన్నికలు..
* నేటి నుంచి రెండు రోజుల పాటు విశాఖలో సీఐఐ సదస్సు.. ప్రారంభించనున్న భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.. సీఐఐ సదస్సు ద్వారా 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యమంటున్న ఏపీ ప్రభుత్వం.. ఏపీ అభివృద్ధికి గేమ్‌ఛేంజర్ అంటున్న కూటమి సర్కార్.. 40 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు అంచనా
* హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. ఉదయం 8 గంటలకు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం.. యూసుఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్.. 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. మధ్యాహ్నం లోపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం
* విశాఖ వేదికగా CII పార్టనర్ షిప్ సమ్మిట్.. రెండు రోజుల భాగస్వామ్య సదస్సును ప్రారంభించనున్న భారత ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్.. ఏపీ అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న విశాఖ భాగస్వామ్య సదస్సు.. దేశ, విదేశాల నుంచి ప్రముఖుల రాక… తొలి రోజు సదస్సులో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలను వర్చువల్ గా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. 25 సెషన్లల్లో వివిధ అంశాలపై కీలక చర్చలు
* అమరావతి : ఇవాళ తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి లోని తన నివాసం నుంచి బయలుదేరి 11.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.. మధ్యాహ్నం 12.20 గంటలకు విమానంలో బయలుదేరి 2.05 గంటలకు బెంగుళూరు చేరుకుంటారు.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 2.40 గంటలకు బెంగుళూరు లోని తన నివాసానికి చేరుకుంటారు జగన్..
* మెదక్ జిల్లాలో నేడు, రేపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటన.. నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల్లో జనంబాట పేరుతో కవిత యాత్ర.. నేడు రెడ్డిపల్లిలో రీజనల్ రింగ్ రోడ్డు భూ బాధితులతో భేటీ కానున్న కవిత.. మెదక్ ఏడు పాయల అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు.. మెదక్ లో వరద బాధితులను పరామర్శించనున్న కవిత
* వరంగల్ జిల్లా: ఈరోజు స్టేషన్ ఘనపూర్ లో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి .
* ఖమ్మం జిల్లాలో నేడు మంత్రి తుమ్మల పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
* తూర్పుగోదావరి జిల్లా: నేటి. నుంచి సదరం స్లాట్ బుకింగ్.. దివ్యాంగుల వైకల్య నిర్ధారణకు ఈనెల 14 నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం.. నవంబరు, డిసెంబరుకు సంబంధించి సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయంలో స్లాట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు సూచన
* నంద్యాల: నేటి సాయంత్రం శ్రీశైలం మల్లన్న ఆలయంలో మొదటిసారిగా కోటిదీపోత్సవం.. ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద భారీ ఏర్పాట్లు.. కైలాస పర్వతంగా భారీగా సెట్టింగ్ ఏర్పాటు చేసిన దేవస్థానం.. గంగాధర మండపం నుండి నంది గుడి వరకు భక్తులు పాల్గొనేలా ఏర్పాటు
* తిరుపతి: నేటి నుంచి మూడు రోజుల పాటు ఐసర్ లో శాస్త్ర అకాడమీ సదస్సు…
* కర్నూలు: మంత్రాలయంలో గ్రామ దేవత మంచాలమ్మకు కుంకుమ అర్చన, తులసి అర్చన, పుష్పర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతాభిషేకం వంటి విశేష పూజలు.. అమ్మవారికి చీర, జాకెట్, గాజులు, పసుపు కుంకుమ పూలు నైవేథ్యం సమర్పించి మొక్కులు తీర్చుకోనున్న మహిళలు.
* శ్రీ సత్యసాయి : రేపటి నుంచి మూడు రోజులపాటు హిందూపురం నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. పట్టణంలో రూ.92. కోట్లతో చేపట్టనున్న మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన చేయనున్న బాలకృష్ణ.. కనకదాసు జయంతి వేడుకల్లో పాల్గొనున్న బాలయ్య