- నేడు రష్యా – ఉక్రెయిన్ మధ్య మరోసారి చర్చలు.
- నేడు దేశవ్యాప్తంగా హోలీపండుగ.
- శ్రీకాకుళం జిల్లా మడపాo గ్రామంలో నేడు రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.
- విశాఖ ఋషికొండలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయంలో నేడు మహాసంప్రోక్షణ. నేటి రాత్రి 7గంటల నుంచి ఆచార్య ఋత్విక్ వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ… మార్చి 23వ తేదీన విగ్రహప్రతిష్ట
- విశాఖ: సింహాచలం వరాహాలక్ష్మి నృసింహ్మస్వామి సన్నిధిలో డోలోత్సవం… నేటి నిత్య కళ్యాణం రద్దు..
- అనంతపురం : రొళ్ల మండల కేంద్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు బ్రహ్మ రథోత్సవం.
- అనంతపురం : నేడు చిలమత్తూరు మండలంలో కనుమ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవం.
- అనంతపురం : కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శేషవాహన సేవ.
- అనంతపురం: హిందూపురం పట్టణంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు స్వామివారి బ్రహ్మ రథోత్సవం .
- అనంతపురం : ఉరవకొండ ప్రభుత్వం పాఠశాల క్రీడా మైదానంలో నేటి నుండి రెండు రోజులపాటు జిల్లా స్థాయి పుట్ బాల్ టోర్నమెంట్.
- తిరుమలలో ఇవాళ పౌర్ణమి గరుడ సేవ… రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
- తిరుమలలో ఇవాళ తుంభురు తీర్ద ముక్కోటి… రెండు సంవత్సరాల తరువాత భక్తులును అనుమతిస్తున్న టీటీడీ.
- నేడు గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం, రాష్ట్రం నలుమూలలనుంచి రథోత్సవానికి భారీగా తరలిరానున్న భక్తులు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
