West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్‌కు ఆదేశం..
- పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గందరగోళం..
- బీజేపీ గుర్తు కనిపించకుండా ఈవీఎంలపై టేపులు..
- మళ్లీ పోలింగ్‌కు ఆదేశించిన ఈసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal polls: పశ్చిమ బెంగాల్ రెండో దశ పోలింగ్ జోరుగా సాగుతోంది. 142 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. ఇదిలా ఉంటే, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి గట్టి పట్టు ఉన్న ప్రాంతాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది.
ఫల్తా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పేరు కనిపించకుండా, కమలం గుర్తు కనిపించకుండా ఈవీఎంలపై టేపు అంటించి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీజేపీ ఐటీ చీఫ్, బెంగాల్ కో-ఇన్‌చార్జ్ అమిత్ మాలవ్య మాట్లాడుతూ, ఈ ఘటన బూత్ నంబర్ 144లో జరిగినట్లు నివేదించబడిందని, అలాగే బూత్‌లు 170 ,189 కూడా ఇదే విధంగా ప్రభావితమయ్యాయని ఆరోపించారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Read Also: Venkatesh: మోహన్‌లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్‌మెంట్!
ఈ ఘటనను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి బూత్‌లలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఈవీఎంలపై నలుపు లేదా తెలుపు టేపు కనిపించి ప్రతీ పోలింగ్ కేంద్రంలతో తిరిగి పోలింగ్ నిర్వహిస్తామని పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో బూత్‌లలో ఇలా టేపు అంటించి ఉంచినట్లు తేలింతే, మొత్తం నియోజక వర్గానికి పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు.
ఫల్తా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పేరు ఈవీఎంపై కనిపించకుండా చేశారని బీజేపీ ఫిర్యాదు చేయడంతో గందరగోళం మొదలైంది. దీనిపై విచారణకు ఈసీ ఆదేశించింది. ఇదిలా ఉంటే, ఫల్తా నియోజకవర్గం తృణమూల్ కీలక నేత జహంగీర్ ఖాన్ సొంత నియోజకవర్గం. ఇటీవల, జహంగీర్ ఖాన్, ఎన్నికల అబ్జర్వర్‌గా వచ్చిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. జహంగీర్ ఖాన్ మనుషులు ప్రజల్ని భయాందోళకు గురిచేస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని అజయ్ పాల్ శర్మ వార్నింగ్ ఇవ్వడం వైరల్‌గా మారింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!