Venkatesh: మోహన్‌లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్‌మెంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ చలనచిత్ర చరిత్రలో ‘దృశ్యం’ మూవీ ఒక సంచలనం. మలయాళంలో మోహన్‌లాల్ పోషించిన జార్జ్ కుట్టి పాత్రను తెలుగులో విక్టరీ వెంకటేష్ అద్భుతంగా పండించారు. అయితే ఈ సినిమా రీమేక్ చేస్తున్న సమయంలో వెంకటేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలను తాజాగా నటి ఎస్తేర్ అనిల్ (Esther Anil) గుర్తు చేసుకున్నారు. ఒక నటుడిగా వెంకటేష్ ఎంతటి సంస్కారం కలిగిన వారో మరోసారి నిరూపించింది.
రీమేక్ షూటింగ్ సమయంలో వెంకటేష్ చాలా ఓపెన్‌గా ఒక విషయాన్ని అంగీకరించారట.. ‘మలయాళ వెర్షన్‌లో మోహన్‌లాల్ గారు ఇచ్చిన కొన్ని ఎక్స్‌ప్రెషన్స్‌ను నేను తిరిగి చేయలేను (Recreate). అది కేవలం ఆయనకు మాత్రమే సాధ్యం’ అని వెంకటేష్ అన్నారట. ఒక స్టార్ హీరో అయి ఉండి, మరో నటుడి ప్రతిభను అంతటి గొప్పగా గౌరవించడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. మలయాళం, తెలుగు, హిందీ వెర్షన్లలో కూతురు పాత్రలో నటించిన ఎస్తేర్ అనిల్.. వెంకటేష్‌తో పనిచేసిన అనుభవాన్ని పంచుకుంటూ ఈ విషయాన్ని వెల్లడించారు. మోహన్‌లాల్ నటన గురించి వెంకటేష్ గమనించి, ఆ స్థాయిని అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదని మెచ్చుకోవడం ఆయన గొప్పతనమని ఆమె కొనియాడారు. ఇక వెంకటేష్ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ రీమేక్ సినిమాలు ఉన్నాయి. ‘దృశ్యం’ విషయంలో కూడా ఆయన తనదైన శైలిలో మార్పులు చేస్తూనే, ఆ పాత్రలోని ఎమోషన్‌ను తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ చేశారు. అందుకే తెలుగులో కూడా ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ భారీ విజయాలను అందుకున్నాయి.
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
తాజావార్తలు
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
-
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!