హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది. స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు అంటూ స్పష్టం చేసింది. ఇస్లాం మతపరంగా అంతగా ముఖ్యమైన అంశం కాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ రితూ రాజ్ అవస్థి నేతృత్వంలో జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ జేఎస్ ఖాజీలతో కూడిన ధర్మానం ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది.…
కర్ణాటకలో చెలరేటిన హిజాబ్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం ట్విట్లర్ వేదికగా.. హిజాబ్ ధరించిన అమ్మాయి ఏదో ఒక రోజు భారత ప్రధానమంత్రి అవుతుందని అన్నారు. హిజాబ్‌లు ధరించినందుకు ముస్లిం విద్యార్థుల బృందం తమ కళాశాలలోకి ప్రవేశించకుండా నిరోధించిన తర్వాత కర్ణాటక హిజాబ్ వ్యవహారం చెలరేగిన నేపథ్యంలో ఇది జరిగింది. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ ఒవైసీ ఆదివారం ఒక వీడియోను ట్వీట్…