Electoral Bonds Scheme: ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electoral Bonds Scheme: లోక్‌సభ ఎన్నికల ముందు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన ‘ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్’పై ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఇది సంపూర్ణ మార్గం అని మేము ఎప్పుడూ చెప్పలేదు’’ అని అన్నారు. ఎలక్టోరల్ బాండ్లపై ప్రతిపక్షాలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. నిజాయతీ తెలిసినప్పుడు ప్రతీ ఒక్కరూ పశ్చాత్తాపపడతారని అన్నారు. ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టడం కోసమే ఈ స్కీమ్‌ని తీసుకువచ్చామని, ప్రతిపక్షాలు ఆరోపణలు చేసి పారిపోవాలని అనుకుంటున్నాయని అన్నారు.
Read Also: CPI Ramakrishna: ఒక్క హామీని కూడా బీజేపీ అమలు చేయలేదు.. పెరిగిన ధరలపై ప్రజలు ఆలోచించాలి..!
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
దర్యాప్తు సంస్థల ద్వారా ఏ 16 కంపెనీలపై విచారణ జరిగింది, ఆ కంపెనీలు ఇచ్చిన విరాళాల్లో బీజేపీకి 37 శాతం రాగా, 63 శాతం బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలకు వచ్చాయని ప్రధాని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్స్ బిల్లు ఆమోదం పొందినప్పుడు పార్లమెంట్‌లో చర్చ జరిగింది, ఇప్పుడు దీనిని విమర్శిస్తున్న వాళ్లు కూడా ఆ సమయంలో సమర్థించారని ప్రధాని అన్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా రూ. 1000, రూ. 2000 డినామినేషన్ కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో ఈ నోట్లను పెద్దఎత్తున తరలించారని.. నల్లధనాన్ని అంతం చేసేలా చర్యలు తీసుకున్నామని ప్రధాని మోదీ చెప్పారు.
ఎలక్టోరల్ బాండ్లపై ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు. ఈ పథకం ద్వారా 3000 కంపెనీలు విరాళాలు ఇచ్చాయని, వీటిలో 26 కంపెనీలు ఈడీ ద్వారా విచారణ ఎదుర్కొంటున్నాయని, వీటిలో 16 కంపెనీలు బీజేపీకి 37 శాతం విరాళాలు ఇస్తే, ప్రతిపక్షాలకు 63 శాతం ఇచ్చాయని ప్రధాని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు కొట్టివేసింది మరియు ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్ల జారీని నిలిపివేయాలని సుప్రీంకోర్ట్ ఎస్‌బీఐని కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తన అధికారిక వెబ్‌సైట్‌లో ఎలక్టోరల్ బాండ్ల డేటాను అప్‌లోడ్ చేసింది. అయితే, ఈ స్కీమ్ ద్వారా బీజేపీ అవినీతికి పాల్పడిందని ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు ఆరోపిస్తు్న్నాయి.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!