Vistara Airline: ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఓ వీధి కుక్క హల్‌చల్ చేసింది. దీంతో ల్యాండ్ అవ్వాల్సిన విస్తారా ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం వెనుదిరాగాల్సి వచ్చిన సంఘటన గోవాలోని దబోలిమ్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. సోమవారం విస్తారా ఎయిర్‌లైన్‌కు చెందిన యూకే 881 విమానం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12.55 గంటలకు గోవా బయలుదేరింది. ఆ విమానం దబోలియా ఎయిర్‌పోర్టుకు చేరుకుని సరిగ్గా రన్‌వేపై ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమైంది. అప్పుడే రన్‌వే పై ఎయిర్ ట్రాఫిక్…