Vijay Rupani: నేడు అధికారిక లాంఛనాలతో విజయ్ రూపానీ అంత్యక్రియలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహాన్ని డీఎన్ఏ టెస్ట్ ద్వారా గుర్తించారు. లండన్‌లో ఉంటున్న భార్య, కుమార్తెను చూసేందుకు వెళ్తుండగా అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోయి 241 మంది ప్రాణాలు చనిపోయారు. ఇందులో విజయ్ రూపానీ ఉన్నారు. డీఎన్‌ఏ టెస్ట్ ద్వారా 3 రోజుల తర్వాత విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు.
ఇది కూడా చదవండి: Trump: నేను శాంతి కోసం చాలా చేస్తాను.. కానీ నాకు క్రెడిట్ దక్కదు
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇక సోమవారం అధికారిక లాంఛనాలతో విజయ్ రూపానీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాజ్‌కోట్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన జ్ఞాపకార్థంగా ఒకరోజు రాష్ట్ర సంతాప దినంగా ప్రకటించింది. అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి: Kamal hassan : ‘థగ్ లైఫ్’ ఓటిటి రిలీజ్ డేట్ లాక్ చేశారా?
ఇక విమానం ఎక్కే ముందు విమానాశ్రయంలో విజయ్ రూపానీ ఆనందంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరు బ్రిటిష్ జాతీయులు చిత్రీకరించిన వీడియోలో దృశ్యాలు కనిపించాయి.

విజయ్ రూపానీ లండన్ టికెట్‌ను రెండుసార్లు రద్దు చేసుకున్నారు. మే 19, జూన్ 5న లండన్ వెళ్లాలనుకున్నారు. కానీ రెండు సార్లు రద్దైంది. జూన్ 25 తిరిగి రావాలని అనుకున్నారు. ఎట్టకేలకు మూడోసారి జూన్ 12 ప్రయాణానికి సిద్ధమయ్యారు. కానీ మూడోసారి మృత్యువుకు దిరికిపోయారు.
జూన్ 12న ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. మెడికోలో ఉంటున్న హాస్టల్‌పై విమానం కూలిపోయింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో 1,25,000 లీటర్ల ఇంధనం ఉంది. సుదూర ప్రయాణం కావడంతో భారీగా ఇంధనం ఉంది. అయితే విమానం కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. ఒక్కరు మినహా మిగతా వారంతా చనిపోయారు. స్వల్ప గాయాలతో ఒక్క ప్రయాణికుడు బయటపడ్డాడు. ఇక మెడికోలు కూడా ఇప్పటి వరకు 35 మంది చనిపోయారు. ఇక చికిత్స పొందుతున్న వారు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!