లోక నాయకుడు కమల్ హాసన్ , దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌ల్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయం చవిచూసింది. తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకున్ని కమల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. రిలీజ్‌కి ముందు ఈ సినిమా గురించి గొప్పలు చెప్పుకున్న కమల్.. టాక్ తెలిసిన తర్వాత సైలెంట్ అయిపోయారు. రూ.200 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజు కేవలం రూ.18 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. మరోవైపు కమల్‌హాసన్ నోటి దురుసు కారణంగా, కర్ణాటకలో ఈ చిత్రం రిలీజ్ ఆగిపోయి మరింత నష్టం తెచ్చింది. మణిరత్నం, కమల్‌హాసన్ కాంబినేషన్ పై ఆశలు పెటుకున్న అభిమానులు కూడా ‘థగ్ లైఫ్’ ఫ్లాప్ దెబ్బకి సైలెంట్ అయిపోయారు. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.
Also Read : Shekhar Kammula : రాజమౌళి మాకు ధైర్యం ఇచ్చాడు.. శేఖర్ కమ్ముల కామెంట్స్
అయితే ఈ చిత్రం రిలీజ్‌కి ముందుగా ఈ సినిమాని రిలీజ్ అయిన 8 వారాల తర్వాత మాత్రమే OTTలో విడుదల చేస్తామని చెప్పారు మేకర్స్. కానీ ఫలితం బెడిసికొట్టడంతో ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ ముందే తీసుకొస్తుంది అని టాక్ . ఇక తాజాగా అయితే రిలీజ్ డేట్ పై కొత్త బజ్ వినిపిస్తుంది. కాగా ‘థగ్ లైఫ్’ చిత్రం ఈ జూన్ 27 లేదా జూలై 4న ముందుగా దక్షిణాది భాషల్లో అందుబాటులోకి వచ్చేస్తుంది అని తెలుస్తుంది. ఇక హిందీ వెర్షన్‌ని జూలై 31కి ప్లాన్ చేస్తున్నట్టుగా వినికిడి. దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.