Viral Video: భారతదేశంలో ప్రజలు హడావిడిగా జీవిస్తున్నారు. 5 నిమిషాలు ఆదా చేయడానికి, వారు తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. సిగ్నల్స్ అయినా, రైల్వే క్రాసింగులైనా వాటిని దాటేందుకు, ప్రజలు నిబంధనలను గాలికి వదిలేశారు. కొందరు ఫుట్ ఓవర్ బ్రిడ్జికి బదులు రోడ్డు దాటేందుకు రోడ్డుపై వెళ్తుండగా, మరికొందరు రైల్వే క్రాసింగ్ గేటు మూసి వేసిన తర్వాత కూడా కింద నుంచి బయటకు రావడం మనం చూస్తుంటాము. దానివల్ల ప్రమాదాలు జరిగే వీడియోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. ఇంత జరుగుతున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక తాజాగా బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌ను హడావుడిగా దాటుతూ తన ప్రాణాలను పణంగా పెట్టాడు. రైలు మొత్తం అతని మీదుగా వెళ్ళింది, కానీ అతను ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి చెందిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Read also: Revanth Reddy: మోడీకి రేవంత్ ఓపెన్ లెటర్.. ఆ హామీలు నెరవేర్చాలని డిమాండ్
భాగల్‌పూర్ స్టేషన్‌లో పట్టాలపై గూడ్స్ రైలు ఆగి ఉంది. స్టేషన్‌లో ఓ వ్యక్తి ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ఫ్లాట్‌ఫామ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉన్నప్పటికీ షార్ట్‌కర్ట్ కోసం పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. పట్టాలపై ఉన్న రైలు కిందకు దూరగానే ఉన్నట్టుండి ట్రైన్ కదిలింది. దీంతో రైలు కింద చిక్కుకుపోయాడు. భయంతో చప్పుడు చేయకుండా ఆ వ్యక్తి అలాగే పడుకొని ఉండిపోయాడు. ట్రైన్ కింద ఉన్న వ్యక్తికి ఏమైందో ఏమోనని చుట్టూ గుమిగూడిన భయంతో వణికిపోయారు. రైలు వెళ్లేంతవరకు కదలవద్దని కేకలు వేస్తూ హెచ్చరించారు. రైలు దాటిన తర్వాత షాక్‌తో లేచి నిలబడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సమీపంలో ఉన్న వ్యక్తులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వైరల్‌గా మారింది.
రైలు కింద చిక్కుకుపోయాడు :