Revanth Reddy: మోడీకి రేవంత్ ఓపెన్ లెటర్.. ఆ హామీలు నెరవేర్చాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Open Letter To PM Narendra Modi: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో.. ఆయనకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. విభజన చట్టం హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ వేదికగా చేసే చట్టాలు, ఇచ్చే హామీలు కచ్చితంగా నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని.. అప్పుడే చట్టసభల పట్ల, ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వసం కొనసాగుతుందని రేవంత్ అన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరచిన అంశాలతో పాటు, పార్లమెంట్ వేదికగా తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం వల్ల.. తెలంగాణ సమాజంలో అసంతృప్తి నెలకొందన్నారు. ఈ హామీల అమలుకు చొరవ తీసుకోవాల్సిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎనిమిదేళ్లుగా నిర్లక్ష్యం చేస్తూ వస్తోందని ఆరోపించారు. రాజకీయ ప్రయోనాలు తప్ప ప్రయోజనాలపై కేసీఆర్ దృష్టి సారించలేదని, ఇప్పుడు కూడా వివాదాలు రాజేసి పబ్బం గడపాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో.. ఈ నేపథ్యంలో దేశ ప్రధానిగా ఇచ్చిన హామీలను నెరవేర్చడం మీ ధర్మమని మోడీకి గుర్తు చేశారు.
పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు:
• లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉన్న బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై నిర్లక్ష్యం వహించడం… ఏర్పాటు సాధ్యం కాదని తేల్చేయడం తెలంగాణ యువతకు నిరాశను మిగిల్చింది.
• కాజీపేట ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు దశాబ్దాల కల. ఈ మేరకు విభజన చట్టం షెడ్యూల్ 13లో, 10వ అంశంగా పేర్కొన్నారు. ఈ హామీ అటకెక్కించారు.
• తెలంగాణలో 12 శాతం గిరిజనులు ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు చట్టం హామీ ఇచ్చింది. ఇప్పటికీ ఏర్పాటుకు చొరవ లేదు.
• పునర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో చేర్చిన సంస్థలు, ఆస్తుల విభజన కొలిక్కి రాలేదు.
• రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు హామీ ఇంకా పరిపూర్ణం కాలేదు. పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రత్యేక ఇన్సెంటివ్‌లు ఇస్తామన్న హామీని నెరవేర్చలేదు.
• తెలంగాణకు దక్కాల్సిన ఐఐటీ, ఐఐఎం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఐఐటీ వంటి ఒక్క ఉన్నత విద్యా సంస్థ కూడా మంజూరు కాలేదు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
ఇతర హామీలు:
• హైదరాబాద్ ఐటీ పరిశ్రమను శిఖర స్థాయికి చేర్చే ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రకటించిన ITIR (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్టిమెంట్ రీజియన్) ప్రాజెక్టును మీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేశారు. దీని వల్ల లక్షలాది మంది యువత ఉపాధి దొరికే అవకాశం కోల్పోయారు.
• పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. దీనిని కేంద్రం కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు.
• తెలంగాణకు మణిహారంగా ఉన్న సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచన కార్మిక వర్గాల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. సింగరేణి తెలంగాణ సెంటిమెంట్… దానిని ప్రైవేటీకరించాలనుకోవడం నిప్పుతో చెలగాటం ఆడటమే.
• సింగరేణి అనుబంధ సంస్థ అయిన “The Andhra Pradesh heavy machinery and engineering company LTD” (అప్మెల్) విషయంలో సమస్య ఇప్పటికీ పరిష్కారం చేయలేదు.
• దక్షిణ తెలంగాణకు వర ప్రదాయిని కృష్ణా జలాలు. ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ, ఏపీ మధ్య నెలకున్న నీటి వివాదాలను పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. కృష్ణా జలాలో మా వాట తేల్చేనే లేదు.
• తెలంగాణ జిల్లాలకు జవహార్ నవోదయ పాఠశాలలు, సైనిక పాఠశాలల ఏర్పాటు విషయంలో మొండి చేయి చూపుతున్నారు.
• తెలంగాణలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వారి జీవనం అత్యంత దుర్భరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో చేనేత పై ఐదు శాతం జీఎస్టీ విధించడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. తక్షణం ఆ నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలి.
• రక్షణరంగ పరిశోధనలకు హైదరాబాద్ గుండెకాయ వంటిది. ఇక్కడకు రావాల్సిన డిఫెన్స్ కారిడార్ ను ఉత్తర ప్రదేశ్ కు తరలించుకుపోయారు. కాంగ్రెస్ హాయంలో హైదరాబాద్ కు ఫ్యాబ్ సిటీని మంజూరు చేసింది. సుమారు 15 లక్షల మంది యువతకు ఇందులో ఉపాధి లభించేది. మీ ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఈ ప్రాజెక్టును నీరుగార్చారు.
వ్యవసాయ రంగంలో అన్యాయం:
• నిజామాబాద్ నుండి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే వారం రోజుల్లో పసుపుబోర్డు తెస్తామని రైతులకు లిఖితపూర్వక హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత మాటమార్చి స్పైసెస్ బోర్డు రీజినల్ సెంటర్ పేరుతో మోసం చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని వంద రోజుల్లో తెరిపిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెరకు రైతులను మోసం చేసింది.
• 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. దానికి భిన్నంగా రైతుల పరిస్థితి తయారైంది. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం ఒక్క తెలంగాణలోనే 8000 పై చిలుకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
• వ్యవసాయ యాంత్రికీకరణను ప్రోత్సహించాల్సింది పోయి ఎరువులు, పురుగు మందులు, టార్పాలిన్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై 18 శాతం జీఎస్టీ… ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలపై 12 శాతం జీఎస్టీ విధించి రైతులపై భారం వేశారు.
• ఎరువులపై అగ్రిసెస్ పేరుతో రూ.30 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోవడం రైతుల నెత్తిన మోయలేని భారం మోపడమే.
• టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై మాటలే తప్ప చర్యలు శూన్యం. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని మీ సహచర కేంద్ర మంత్రి అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆరోపణలు చేశారు. దీనిపై చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం శూన్యం.
• కోకాపేట, ఖానామెట్ భూముల వేలంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.1000 నుండి 1500 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీనిపై పత్రసహితంగా కాంగ్రెస్ పార్టీ సీబీఐకి ఫిర్యాదు చేసినా చర్యలు లేవు.
• హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డగా మారింది. ఈ కేసును కేంద్ర సంస్థలైన సీబీఐ, ఈడీ, నార్కొటిక్ అనాలసిస్ బ్యూరో లాంటి కేంద్ర సంస్థలకు అప్పగించాలని కోరుతున్నా అటు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇటు మీ ప్రభుత్వం సిద్ధంగా లేవు.
• అటవీ హక్కుల చట్టం -2006 ను తెలంగాణ ప్రభుత్వం యథేశ్చగా ఉల్లంఘిస్తూ… గిరిజనులు, ఆదివాసీల హక్కులను కాలరాస్తోంది. దీనిపై కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు.
ఈ విధంగా పైన తెలిపిన హామీలపై ప్రశ్నల వర్సం కురిపిస్తూ.. కేంద్రం ఎందుకు తెలంగాణ పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీలోని కొందరు నేతలు సైతం కేసీఆర్ వైఖరిని సహకరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం అలజడి సృష్టించడం తప్పిస్తే.. రాష్ట్ర ప్రయోజనాల కోసం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇప్పుడు తెలంగాణ పర్యటనలో పైన పేర్కొన్న అంశాలపై ఈ గడ్డ మీదనే కార్యాచరణ ప్రకటించాలని రేవంత్ డిమాండ్ చేశారు. లేకపోతే.. వచ్చే శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాలపై పార్లమెంట్ వేదికగా పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
-
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
-
Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్‌కే నేరుగా హెచ్చరిక..
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!