Uttarakhand: అదుపుతప్పి నదిలోకి వాహనం.. ఆరుగురు గల్లంతు..
Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా ఓ వాహనం అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. దీంతో అందులోని 11 మంది నదిలో పడిపోయారు. వీరిలో ఆరుగురు గల్లంతవ్వగా.. 5 మందిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడి.. రోడ్లపై పడ్డాయి. ఈ క్రమంలో రోడ్డుకు అడ్డుగా పడి ఉన్న బండరాయిని తప్పించబోయి వాహనం అదుపుతప్పి నదిలో పడింది.
Read also: Passion Fruit : పాషన్ ఫ్రూట్ అనే ఈ జ్యూస్ గురించి తెలుసా..?
Also Read
- Air India to Cut Flights: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం..! వేరే దారి లేదు మరి..
- Emergency Alert: మీ మొబైల్స్ పెద్ద శబ్దంతో మోగాయా? కంగారు పడకండి.. మేటరేంటంటే..!
- Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
- Vijay: ఆలయాల బాట పట్టిన విజయ్.. టీవీకే శ్రేణుల్లో నూతనోత్సాహం
స్థానికుల సమాచారంతో పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నదిలో పడిపోయిన 11 మందిలో ఐదుగుర్ని రెస్క్యూ టీమ్ రక్షించింది. బాధితుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన దంపతులు ఉన్నట్లు తెలుస్తోంది. నదిలో నుంచి భార్యను రక్షించిన రెస్క్యూ టీమ్, భర్త కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
బాధితులు సోన్ ప్రయాగ్ నుంచి శనివారం రాత్రి 8 గంటలకు రిషికేశ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో రాత్రి 3 గంటల సమయంలో తెహ్రీ జిల్లా గులార్ సమీపంలోని మలకుంతి బ్రిడ్జ్ వద్ద ప్రమాదానికి గురయ్యింది. రోడ్డుకు అడ్డంగా ఉన్న బండ రాయిను తప్పించబోయి నదిలోకి దూసుకెళ్లింది. దీని గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నదిలో నుంచి ఐదుగురిని రక్షించ గలిగారు. వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గల్లంతైన డ్రైవర్‌తో సహా మరో ఆరుగురి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. గల్లంతైనవారి కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ (Search and Rescue Operation) కొనసాగుతోంది. వర్షాల కారణంగా పర్వతాల మీద నుంచి బండరాయి ఒక్కసారిగా దొర్లుకుంటూ వచ్చింది. ఆ బండరాయిని తప్పించే ప్రయత్నంలో మ్యాక్స్ వాహనం అదుపు తప్పి.. రోడ్డు మీద నుంచి లోయలో ప్రవహించే నదిలో పడిపోయింది.
తాజావార్తలు
-
Akhil-Lenin: అదే పెద్ద ప్లస్ పాయింట్.. ఇక ‘లెనిన్’కు తిరుగులేదు!
-
Veg Pulao Recipe: లంచ్ బాక్స్‌కు బెస్ట్ ఛాయిస్.. రెస్టారెంట్ స్టైల్ వెజ్ పులావ్.. ఇంట్లోనే ఈజీగా చేయండిలా..
-
Iran-US: మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలు కాబోతుందా? ఇరాన్ సైన్యం హై అలర్ట్!
-
Air India to Cut Flights: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం..! వేరే దారి లేదు మరి..
-
Mahesh Babu: బ్లాక్ ఫారెస్ట్‌లో ఫుల్ బిజీగా బాబు.. అందుకోసమేనా?
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!