Raebareli: రాయ్‌బరేలీ పోరులో వరుణ్ గాంధీ.. బీజేపీ ప్రతిపాదన తిరస్కరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raebareli: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ ఎంపీ స్థానం నుంచి వరుణ్ గాంధీని రంగంలోకి దించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ ప్రియాంకాగాంధీని పోటీలో నిలబెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే, ఆమెకు పోటీగా అదే కుటుంబానికి చెందిన వరుణ్ గాంధీని రంగంలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. అయితే, ఈ ప్రతిపాదనను వరుణ్ గాంధీ తిరస్కరించినట్లు సమాచారం.
ఈ స్థానం నుంచి ప్రియాంకా గాంధీని పోటీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు బుధవారం తెలిపాయి. ఈ స్థానం నుంచి సోనియాగాంధీ ఎంపీగా ఉన్నారు. అయితే, ఆమె ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికై, ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ స్థానం నుంచి ప్రియాంకాను బరిలోకి దించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ వరుణ్ గాంధీని పోటీలో దింపాలని అనుకున్నప్పటికీ, ఆయన దీనికి అంగీకరించనట్లు తెలుస్తోంది. ‘‘గాంధీ వర్సెస్ గాంధీ’’ పోరుకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
Read Also: Sahya: యూట్యూబర్ మౌనిక రెడ్డి హీరోయిన్గా “సహ్య”.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్!
వరుణ్ గాంధీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పిలిభిత్ స్థానానికి బీజేపీ ఆయనను కాదని మాజీ మంత్రి జితిన్ ప్రసాదను ఆ స్థానంలో నిలబెట్టింది. అయితే, అప్పటి నుంచి ఆయన బీజేపీపై అసంతృప్తితో ఉన్నారని సమాచారం. మరోవైపు వరుణ్ గాంధీ తల్లి, మేనకాగాంధీకి సుల్తాన్‌పూర్ ఎంపీ టికెట్‌ని బీజేపీ కేటాయించింది. అయితే, రాయ్‌బరేలీలో గాంధీ ఫ్యామిలీకి ఎవరు గట్టి సవాల్ విసురుతారనే దానిపై బీజేపీ అనేక సర్వేలు నిర్వహించినట్లు సమాచారం.
2004 నుంచి సోనియాగాంధీ ఈ స్థానం నుంచి వరసగా గెలుస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాయ్‌బరేలీ సీటు నుంచి 1967 నుంచి 1984 వరకు పార్లమెంట్‌కి పంపబడ్డారు. అరుణ్ నెహ్రూ, షీలా కౌల్‌తో సహా నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన ఇతర సభ్యులు కూడా రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకున్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని అమేథీ నుంచి స్మృతి ఇరానీ ఓడించినప్పటికీ, రాయ్‌బరేలీని మాత్రం బీజేపీ కైవసం చేసుకోలేకపోయింది. అయితే, 2014 నుంచి సోనియాగాంధీ ఓట్ల శాతం మాత్రం తగ్గుతూ వస్తోంది. 2009 ఫలితాలతో పోలిస్తే 2014లో ఓట్ల శాతం 8.43 శాతం తగ్గగా, 2019లో మరో 8 శాతానికి పడిపోయింది. ఏప్రిల్ 30లోపు రాయ్‌బరేలీ మరియు అమేథీ అభ్యర్థులపై పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రెండో దశ పోలింగ్‌లో వయనాడ్‌కి ఏప్రిల్ 26న ఎన్నికలు జరిగిన తర్వాత వీటికి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఇది ముగిసిన తర్వాత అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..