PM Narendra Modi: పశువుల్లో వచ్చే లంపి చర్మ వ్యాధిని నియంత్రించేందుకు రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అనేక రాష్ట్రాల్లో పశువులు లంపి వ్యాధితో బాధపడుతున్నాయని.. ఈ వ్యాధి పాడి పరిశ్రమకు ఆందోళన కలిగిస్తోందన్నారు. శాస్త్రవేత్తలు లంపి చర్మ వ్యాధి నివారణకు స్వదేశీ వ్యాక్సిన్‌ను సిద్ధం చేశారని వరల్డ్ డెయిరీ సమ్మిట్ 2022లో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఇటీవలి కాలంలో ఈ వ్యాధి కారణంగా భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో పశువులు మృతి చెందాయని ఆయన వెల్లడించారు.
లంపి చర్మ వ్యాధి(LSD) అనేది ఒక వైరల్ వ్యాధి, ఇది పశువులను ప్రభావితం చేస్తుంది. జ్వరం, చర్మంపై నోడ్యూల్స్‌తో పాటు మరణానికి కూడా దారితీస్తుంది. ఈ వ్యాధి దోమలు, ఈగలు, పేనులు, కందిరీగలు, పశువుల మధ్య ప్రత్యక్ష సంబంధం, కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంది. ప్రధాన లక్షణాలు జంతువులలో జ్వరం, కళ్ళు మరియు ముక్కు నుండి స్రావాలు, నోటి నుండి లాలాజలం, శరీరమంతా నోడ్యూల్స్ వంటి మృదువైన పొక్కులు, పాల ఉత్పత్తి తగ్గడం, తినడానికి ఇబ్బంది, ఇది కొన్నిసార్లు జంతువు మరణానికి దారితీస్తుంది. “గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌తో సహా ఆరు-ఏడు రాష్ట్రాల్లో లంపి చర్మ వ్యాధి వ్యాపించింది. ఆంధ్రప్రదేశ్‌లో, కొన్ని కేసులు నమోదయ్యాయి.
NIA Raids: టెర్రర్ గ్రూపులతో లింకున్న గ్యాంగ్‌స్టర్ల అణచివేత.. భారీస్థాయిలో ఎన్‌ఐఏ దాడులు
వరల్డ్ డెయిరీ సమ్మిట్ 2022 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రి సంజీవ్ బల్యాన్ కూడా పాల్గొన్నారు.