Durgam cheruvu: నగరంలోని దుర్గం చెరువుపై ఉన్న తీగల వంతెనపై నుంచి వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూడు రోజుల పాటు వంతెనపై వాహనాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. దుర్గం చెరువు కేబుల్ వ్యవస్థ పరిశీలనలో భాగంగా బ్రిడ్జిపై భారీ క్రేన్‌ను అమర్చాల్సి ఉన్నందున ట్రాఫిక్‌ను బంద్ చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ తెలిపారు.
Read also: Assam MLA: తాజ్‌మహల్, కుతుబ్‌మినార్లను కూల్చేయండి.. మోడీ జీ
హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై ఉన్న తీగల వంతెనపై నుంచి వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు వంతెనపై వాహనాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. దుర్గా లేక్ కేబుల్ సిస్టమ్ పనుల పరిశీలనలో భాగంగా బ్రిడ్జిపై భారీ క్రేన్‌ను అమర్చాల్సి ఉన్నందున ట్రాఫిక్‌ను బంద్ చేస్తున్నట్లు లోకేష్ కుమార్ వెల్లడించారు. కాగా, ట్రాఫిక్ నిలిచిపోయే నాలుగు రోజుల పాటు ట్రాఫిక్‌ను వివిధ మార్గాల్లో మళ్లిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రోడ్ నంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను రెండు మార్గాల్లో మళ్లిస్తారు. అలాగే ఐకియా రోటరీ నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా జూబ్లీహిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను రెండు మార్గాల్లో మళ్లిస్తారు. ఈ విషయాన్ని గమనించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. ఈ మార్గంలో వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. జూబ్లీహిల్స్ నుంచి ఐక్య వైపు వెళ్లే వాహనదారులు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మీదుగా వెళ్లాలని సూచించారు. ఐకా నుంచి జూబ్లీహిల్స్‌కు వచ్చే వాహనాలను ఇన్ ఆర్బిట్ మాల్, దుర్గం చెరువు, మాదాపూర్ నుంచి మళ్లించాలని పోలీసులు కోరారు.
Delhi BJP leaders: బండి సంజయ్ అరెస్ట్ పై ఫోకస్ పెట్టిన ఢిల్లీ బీజేపీ నేతలు