Stock market: ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్ విలవిల.. 4 రోజుల్లోనే రూ. 1.75 లక్షల కోట్లు ఆవిరి..
- స్టాక్ మార్కెట్లపై ఇరాన్ వార్ ఎఫెక్ట్..
- 4 రోజుల్లోనే రూ. 1.75 లక్షల కోట్లు కోల్పోయిన భారత ఇన్వెస్టర్లు..
- టాప్-10 కంపెనీల్లో 7 భారీగా నష్టపోయాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock market: అమెరికా-ఇరాన్ యుద్ధం తగ్గే పరిస్థితులు లేకపోవడం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ వార్ ఎఫెక్ట్ భారతీయ స్టాక్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. యుద్దం తీవ్రత పెరుగుతున్న కొద్దీ పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. గత వారం కేవలం 4 రోజుల్లోనే పెట్టుబడిదారులు సుమారుగా రూ. 1.75 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. గత వారం సెన్సెక్స్ 949.74 పాయింట్లు (1.27%) పడిపోయింది, నిఫ్టీ సుమారు 294.9 పాయింట్లు (1.27%) తగ్గింది. బీఎస్ఈలో టాప్-10 కంపెనీలలో 7 కంపెనీలు నష్టాలను చవిచూశాయి. నష్టపోయిన వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ ఉన్నాయి.
ముఖేస్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ. 18.25 లక్షల కోట్లకు పడిపోయింది. పెట్టుబడిదారులు రూ. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 37,249 కోట్లు తగ్గి రూ. 11.64 లక్షల కోట్లకు పడిపోయింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బిఐ నష్టాల్లో మూడవ స్థానంలో నిలిచింది. ఎస్బిఐ మార్కెట్ క్యాప్ రూ. 35,399 కోట్లు తగ్గి రూ. 9.42 లక్షల కోట్లకు పడిపోయింది. నష్టపోయిన ఇతర కంపెనీల్లో ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, హిందూస్థాన్ యూనిలీవర్, టీసీఎస్ ఉన్నాయి.
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
లాభపడిన వాటిలో ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. ఎల్టి మార్కెట్ క్యాప్ రూ.18,052 కోట్లు పెరిగి రూ.4.90 లక్షల కోట్లకు చేరింది. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ విలువ రూ.8,680 కోట్లు పెరిగి రూ.5.25 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది కాకుండా, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.6,245 కోట్లు పెరిగి రూ.5.15 లక్షల కోట్లకు చేరింది.
అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం, విదేశీ పెట్టుబడులు తగ్గే ప్రమాదం, పెట్టుబడిదారుల్లో భయం పెరగడం మార్కెట్ పతనానికి కారణమైంది. నష్టాలు వచ్చినప్పటికీ మార్కెట్ క్యాప్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీని తర్వాత హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్ టెల్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, టీసీఎస్, బజాజ్ ఫైనాల్స్, ఇన్ఫోసిస్, ఎల్ అంట టీ ఉన్నాయి.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!