Reservation Effect: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఆస్తా శ్రీవాస్తవ లింక్డ్ఇన్ లో పెట్టిన పోస్ట్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ సందర్భంగా, తాను ఇష్టపూర్వకంగా భారత్‌ను వదిలి వెళ్లడం లేదు.. బలవంతంగా తీసుకున్న వల్ల నిర్ణయంతో వెళ్తున్నాను అని రాసుకొచ్చింది. అయితే, సింగపూర్, దుబాయ్‌లలోని ఎస్‌పీ జైన్ గ్లోబల్ ఎంబీఏ ట్విన్ సిటీ ప్రోగ్రామ్‌లో ఆస్తా శ్రీవాస్తవ ప్రవేశం పొందారు. ఇది ఒక గర్వకారణమైన విషయమని నేను భావిస్తున్నప్పటికీ, భారత్‌ను వదిలి వెళ్తున్నందుకు బాధ పడుతున్నాను అని పేర్కొనింది. ఇది నాకు మాత్రమే కాదు, నా కుటుంబానికి కూడా కఠిన నిర్ణయం అన్నారు. మేము ఎప్పుడూ భారత్ అభివృద్ధికి కృషి చేయాలనుకున్నాం.. కానీ పరిస్థితులు మాకు వేరే మార్గం చూపించలేదని లింక్డ్ఇన్ లో రాసుకొచ్చింది.
Read Also: Allu Aravind : పవన్ కళ్యాణ్ ను అల్లు అరవింద్ అమ్మ ఏమనిపిలుస్తారో తెలుసా?
రిజర్వేషన్ ప్రభావం: అవకాశాలు కోల్పోయిన ప్రతిభ
లక్నో యూనివర్శిటీ నుంచి ఉత్తమ ర్యాంకుతో పట్టభద్రురాలై, క్యాట్ పరీక్షలో టాప్ మార్కులు సాధించాను అని ఆస్తా శ్రీవాస్తవ తెలిపింది. ఇక, దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలని కలలు కన్నాను.. కానీ, రిజర్వేషన్ విధానాల కారణంగా ఆ అవకాశం నాకు లభించలేదు.. తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు రిజర్వేషన్లో సీట్లు వచ్చాయి. 2013లో ఐఐఎంలో చేరలేక, ఎఫ్‌ఎంఎస్‌లో చేరాల్సి వచ్చింది.. 2025లో జీఎమ్యాట్‌లో మంచి స్కోరు సాధించాను.. అయినప్పటికీ, జనరల్ కేటగిరీ సీట్లు పరిమితం కావడంతో మళ్లీ నిరాశే ఎదురైంది.. అందుకే విదేశీ విద్యను ఎంచుకోవాల్సి వచ్చింది అని వెల్లడించింది.
Read Also: Aishwarya Rai : తన మార్ఫింగ్, ఏఐ వీడియోలపై.. కోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యరాయ్
వేలాది మందికి జరిగిన సంఘటన..
ఈ అనుభవం తనకే పరిమితం కాలేదు, దేశంలోని వేలాది ప్రతిభావంతులైన విద్యార్థుల పరిస్థితి ఇదే అని ఆస్తా శ్రీవాస్తవ అభిప్రాయపడింది. మన దేశం ప్రతిభావంతులను కోల్పోతోంది. ఇతర దేశాలు వారిని గౌరవిస్తూ, అవకాశాలు ఇస్తూ, తమను బలోపేతం చేసుకుంటున్నాయని ఆమె ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలను ఉటంకించింది. అయితే, రిజర్వేషన్ అసలు ఉద్దేశం సామాజిక న్యాయం కల్పించడమేనని, కానీ, అది ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల సాధనంగా మారిందని ఆమె విమర్శించింది. అది ఒకప్పుడు న్యాయం సాధించే సాధనం.. కానీ ఇప్పుడు అది మరో రకమైన వివక్షగా మారిపోయిందని పేర్కొనింది.
Read Also: Nepal Gen Z Protests: నేపాల్‌లో ఉద్రిక్తంగా జెన్-జెడ్ ఉద్యమం.. ఎవరీ సుడాన్ గురుంగ్?
వైరల్ అయిన పోస్ట్
తన అభ్యర్థన ఏ సమాజానికి వ్యతిరేకం కాదని ఆస్తా తెలిపింది. ఇది సమాన అవకాశాల కోసం చేసే విజ్ఞప్తి అని స్పష్టం చేసింది. ప్రతిభాశక్తి ప్రాధాన్యం పొందే విధంగా మార్పులు అవసరం ఉంది.. లేకపోతే, మన brightest minds ఇతర దేశాలకు వెళ్లిపోతారు అని హెచ్చరించింది. ఇక, ఆమె లింక్డ్ఇన్ లో చేసిన పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయింది. ఎక్స్ (ట్విట్టర్) సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చర్చనీయాంశమైంది. మరొక ప్రతిభావంతురాలు దేశాన్ని వదిలి వెళ్తుంది, కారణం రిజర్వేషన్ వ్యవస్థ అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు “78 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా రిజర్వేషన్లు కొనసాగుతున్నాయంటే అది ఉద్దేశాల లోపం మాత్రమే.. మార్పు రాకపోతే brain drain కొనసాగుతుందని వ్యాఖ్యనించారు.
Read Also: Aishwarya Rai : తన మార్ఫింగ్, ఏఐ వీడియోలపై.. కోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యరాయ్
రిజర్వేషన్లకు మద్దతుగా..
అయితే, కొందరు సోకాల్డ్ మేదావులు పెద్ద పెద్ద చదువులు చదువుతారే కానీ సమాజాన్ని కొంచెం కూడా అర్థం చేసుకోకుండా పిచ్చి పిచ్చి మాటలు వాగుతుంటారు. మన దేశంలో ప్రతి ఒక్కరు తరుచుగా మాట్లాడే వాటిలో ‘రిజర్వేషన్ల గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు.. సమాజానికి నీతులు చెప్పే స్థాయిలో ఉండి కూడా.. కనీస బాధ్యత లేకుండా కొందరు మాట్లాడుతారు. ఇక, రిజర్వేషన్ల అంశంపై స్పందించేవారికి వాస్తవాలు తెలియవని కాదు, కానీ వాళ్ల మెదళ్లలో పేరుకుపోయిన కులాహంకారంతో ఇష్టానుసారం మాట్లాడుతుంటారు.
ఇక, రాబోయే రోజుల్లో కచ్చితంగా రిజర్వేషన్లు లేని సమాజం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ, సమాజంలో ఉన్న అందరిని సమానంగా చూడాల్సి.. అలా చూడాలంటే అందరూ సమానంగా ఎదగాలి. ఇక, ఇప్పుడున్న అసమానతలు మొత్తం తొలిగిపోవాలి.. అవి పోవాలంటే అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకి చేయూత ఇవ్వాల్సిందే. అయితే, ఈ రిజర్వేషన్లను కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా అమలు చేయలేకపోతున్నాయనే విషయాన్ని ప్రతి ఒక్క సోకాల్డ్ మేదావులు గుర్తు పెట్టుకోవాలి. దేశ జనాభాలో 90 శాతం మంది వెనుకబడిన కులాల ప్రజలే ఉన్నారు. ఇన్నేళ్ల రిజర్వేషన్ల తర్వాత కూడా వారికి అన్ని రంగాల్లో 5-20 శాతం మాత్రమే ఎందుకుందని ముందుగా ఆలోచించాలి. ఈ సమస్యను హృదయంతో అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది.. అంతేగానీ, ఇలా సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్ట్ పెట్టి మేమే పెద్ద తోపులం అని ఫీల్ కావొద్దని మరికొందరు నెటిజన్స్ రాసుకొస్తున్నారు.
https://www.linkedin.com/feed/update/urn:li:activity:7369987388539891712/