Candy Crush: “క్యాండీ క్రష్” గేమ్‌కి బానిసైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. ఎలా తెలిసిందంటే..
- ‘క్యాండీ క్రష్’ గేమ్‌కి బానిసైన ఉపాధ్యాయుడు..
- కలెక్టర్ పాఠశాల సందర్శించిన సమయంలో వెలుగులోకి..
- ఫోన్ పరిశీలించగా.. స్కూల్ టైమ్‌లోనే ఆట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Candy Crush: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ‘‘క్యాండీ క్రష్’’ మొబైల్ గేమ్‌కి బానిసగా మారాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా అదే పనిగా తన ఫోన్లో గేమ్ ఆడుతున్నట్లు విచారణలో తేలింది. డ్యూటీ సమయంలో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అతడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జిల్లా కలెక్టర్ రాజేంద్ర పన్సియా పాఠశాలను సందర్శించిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యాదృచ్ఛికంగా పాఠశాలను తనిఖీ చేసిన సమయంలో విద్యార్థుల పుస్తకాల్లో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చాలా తప్పుల్ని గుర్తించారు. దీంతో లోతుగా విచారించగా క్యాండీ క్రష్ విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also: BMW Hit-And-Run: యాక్సిడెంట్‌కి ముందు 12 లార్జ్ విస్కీ పెగ్గులు తాగిని నిందితుడు మిహిర్షా..
Also Read
- Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
ఉపాధ్యాయుడి ఫోన్ తనిఖీ చేయగా, అందులోని ఒక ఫీచర్ అతను ఏఏ యాప్స్‌ని ఎక్కువగా వాడుతున్నాడనే విషయాన్ని వెల్లడించింది. క్యాండీ క్రష్ గేమ్ కోసం గంటల తరబడి సమయాన్ని వెచ్చించినట్లు తేలింది. పాఠశాల విధుల సమయంలో క్యాండీ క్రష్ ఆడటానికి దాదాపు రెండు గంటలు గడిపినట్లు తేలింది. ‘‘ఉపాధ్యాయులు విద్యార్థుల క్లాస్‌వర్క్ మరియు హోంవర్క్‌లను తనిఖీ చేయడంపై దృష్టి పెట్టాలి మరియు వారికి నాణ్యమైన విద్య అందేలా చూడాలి. అలాగే, మొబైల్ ఫోన్లను ఉపయోగించడం సమస్య కాదు, కానీ పాఠశాల సమయంలో వ్యక్తిగత కారణాల కోసం వాటిని ఉపయోగించడం సరికాదు’’ అని కలెక్టర్ చెప్పారు.
కలెక్టర్ పన్సియా ఆరుగురు విద్యార్థుల కాపీలను చెక్ చేగా, 95 తప్పుల్ని గుర్తించారు, వీటిలో 9 తప్పులు మొదటి పేజీలోనే ఉన్నాయి. దీంతో అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్ అసిస్టెంట్ టీచర్ ప్రియమ్ గోయల్ ఫోన్ తనిఖీ చేశారు. టీచర్ ఫోన్లోని వెల్బీయింగ్ ఫీచర్ ద్వారా ఐదున్నర గంటల పాఠశాల విధుల్లో ప్రియమ్ గోయల్ రెండు గంటల పాటు క్యాండీ క్రష్, 26 నిమిషాలు ఫోన్లో మాట్లాడటం, 30 నిమిషాలు సోషల్ మీడియాను ఉపయోగించినట్లు తేలింది. జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని గ్రహించి రాష్ట్ర విద్యాశాఖకు సమచారం అందించడంతో, వారు అతడిని సస్పెండ్ చేశారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!