1978 Sambhal Riots: ఇటీవల కాలంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ నగరం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నవంబర్ నెలలో సంభాల్‌లోని షాహీ జామా మసీదు సర్వేకి వెళ్లిన అధికారులపై ఓ వర్గం రాళ్లదాడి చేసింది. ఈ దాడిలో నలుగురు మరణించారు. జామా మసీదు పురానత హరిహర్ ఆలయాన్ని కూల్చేసి కట్టినట్లు హిందూ వర్గం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కోర్టు సర్వేకి ఆర్డర్ ఇచ్చింది.
ప్రస్తుతం మరో వార్త వినిపిస్తోంది. 1978లో సంభాల్‌లో భారీగా మత ఘర్షణలు జరిగాయి. ఈ కేసును తిరిగి దర్యాప్తు చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ వదంతులను తిరస్కరించారు. “1978లో సంభాల్‌లో జరిగిన మత అల్లర్లపై తిరిగి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా మరియు ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తప్పుదారి పట్టించే సమాచారం వ్యాప్తి చెందుతోంది. అయితే, అలాంటి ఏమీ లేదు” అని సంభాల్ పోలీసు సూపరింటెండెంట్ (SP) కృష్ణ కుమార్ బిష్ణోయ్ అన్నారు.
1978 అల్లర్లకు సంబంధించిన వివరాలు కోరుతూ.. డిసెంబర్ 17న ఎమ్మెల్యే శ్రీష్ చంద్ర శర్మ రూల్ 115 కింద ఒక లేఖని సమర్పించారని ఎస్పీ తెలిపారు. దీని వల్ల ప్రభుత్వం ఈ విషయంపై సమాచారం కోరినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని కలెక్ట్ చేస్తున్నామని, ప్రక్రియ పూర్తి కాగానే ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు.
Read Also: Liquor Payments: తెలంగాణా సర్కార్‌కు మద్యం కంపెనీల అల్టిమేటం.. బకాయిలు చెల్లించాల్సిందే!
భారత చరిత్రలో అతిపెద్ద అల్లర్లు:
మొరాదాబాద్ జిల్లాలోని సంభాల్‌లో జరిగిన 1976 అల్లర్లలో దాదాపుగా 184 మంది మరణించినట్లు సమచారం. అయితే, 2010లో ఆధారాలు లేకపోవడంలో కోర్టు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. 1976లో మసీదు మతాధికారి హత్య తర్వాత సంభాల్ లో అల్లర్లు చెలరేగాయి. రెండు నెలల పాటు సంభాల్‌లో కర్ఫ్యూ ఉంది. ఆ సమయంలో జనతా పార్టీ అధికారంలో ఉంది. రామ్ నరేష్ యాదవ్ సీఎంగా ఉన్నారు. మార్చి 28, 1978లో సంభాల్‌లో అతిపెద్ద అల్లర్లు జరిగాయి. హోలికా దహన్ స్థలంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఒక దుకాణదారుడు మరో వర్గానికి చెందిన వ్యక్తిని చంపడంతో అల్లర్లు చెలరేగాయి.
అల్లర్ల సమయంలో వ్యాపారవేత్త బన్వారీ లాల్ తన బావమరిది మురారి లాల్ భవనంలో దుకాణదారులను దాచిపెట్టాడు. అల్లర్లకు పాల్పడిన వారు ట్రాక్టర్‌తో భవనం గేటు పగలగొట్టి 24 మందిని చంపారు. సంభాల్ చుట్టుపక్కల అన్ని ఊర్లలో అల్లర్లు జరిగాయి. కొన్ని మృతదేహాలు దొరకకపోవడంతో వారి బొమ్మలను దహనం చేశారు. వ్యాపారి బన్వారీ లాల్‌ను కూడా దారుణంగా చంపారు. అల్లర్లలో అతడిని పట్టుకుని అతని అవయవాలు నరికేశారు. ఈ కేసులో 48 మంది నిందితులుగా ఉన్నారు. కానీ వీరిపై తగిన ఆధారాలు లేకపోవడంతో 2010లో అందరూ నిర్దోషులుగా విడులయ్యారు. తీర్పు చెప్పిన న్యాయవాది.. ఇలాంటి వారిని ఉరితీయలేకపోతున్నామంటే నమ్మలేకుండా ఉన్నామని అన్నారు.