Unknown Gunmen: పాకిస్తాన్‌లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..

  • పాకిస్తాన్‌లో ‘‘ధురంధరులు’’..
  • 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
  • తాజాగా పుల్వామా సూత్రధారి ఖతం..
Pak Terrorists

Pak Terrorists

Unknown Gunmen: పుల్వామా ఉగ్రవాద దాడి ప్రధాన సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హమ్జా బుర్హాన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు పాకిస్తాన్‌లో కాల్చి చంపారు. పాక్ ఆక్రమిక కాశ్మీర్(పీఓకే)లోని ఇతడి మృతదేహం లభ్యమైంది. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా అటాక్‌లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. దీని తర్వాత భారత్ పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్ స్థావరాలపై వైమానిక దాడులు చేసింది.

ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌లో ఉగ్రవాదులకు గ్యారెంటీ లేకుండా పోయింది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు వచ్చి చంపుతారో అని ఉగ్రవాదులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పాకిస్తాన్‌లో ధురంధరులు భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని చంపేస్తున్నారు. 5 ఏళ్లలో 26 మంది కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో సంబంధం ఉన్న, అతడి అనుచరులను కూడా హతమారుస్తున్నారు. ఇతడి సన్నిహితుడిగా పేరున్న షేక్ యూసుఫ్ అఫ్రిదీ ఇటీవల హతమయ్యాడు. ఏడాది క్రితం లష్కరేకు చెందిన కీలక కమాండర్ సైఫుల్లా ఖాలిద్‌‌ను కూడా అజ్ఞాత వ్యక్తులు చంపేశారు. లష్కరేతో పాటు జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహీదిన్‌కు చెందిన ఉగ్రవాదులను కూడా టార్గెట్ చేస్తూ చంపేస్తున్నారు.

ఇప్పటి వరకు హతమైన కీలక ఉగ్రవాదులు వీరే:

1) మౌలానపా కాషిఫ్ అలీ, ఇతను హఫీజ్ సయీద్ మరో సన్నిహితుడు 2025 ఫిబ్రవరిలో కాల్చి చంపారు.

2) ముఫ్తీ షా మీర్, ఇతను ఐఎస్ఐ రహస్య ఏజెంట్. బలూచిస్తాన్‌లోని తుర్బత్‌లో 2025 హతమ్యాడు. ఇతను మాజీ నేవీ ఆఫీసర్ కుల్‌భూషన్ యాదవ్‌ను కిడ్నాప్ చేసి ఐఎస్ఐకి అప్పగించాడు.

3)మౌలానా హమీదుల్ హక్ హక్కానీ, 2025 ఫిబ్రవరిలో శుక్రవారం ప్రార్థనల అనంతరం ఆత్మాహుతి దాడిలో మరణించాడు.

4)ముఫ్తీ అబ్దుల్ బాఖీ నూర్జాయ్, 2025 మార్చి 16న పాకిస్థాన్‌లోని క్వెట్టాలో ఇతడిని కాల్చి చంపారు.

6)మేజర్ డానియల్, 2024 మార్చిలో, పాకిస్తాన్ ఆర్మీ అధికారి అయిన ఇతడు పెషావర్ లో గుర్తు తెలియని దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు.

7)అబు ఖతల్, ఇతను భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా పరిగణిస్తారు. జీలం జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. రియాసి ఉగ్రవాద దాడికి ఇతను సూత్రధారి.

8)అద్నాన్ అహ్మద్, ఇతడిని 2023 డిసెంబర్‌లో కరాచీలో హత్యకు గురయ్యాడు. అద్నాన్, హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడు, లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది.

9)షాహిద్ లతీఫ్, ఇతనున పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి సూత్రధారి, జైష్-ఎ-మొహమ్మద్ అగ్రశ్రేణి కమాండర్ ఈ ఉగ్రవాదిని 2023 అక్టోబర్‌లో పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో ఒక మసీదు వద్ద గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు.

10) రహీముల్లా తారిఖ్, 2023 నవంబర్‌లో కరాచీలో కాల్చి చంపబడ్డారు. మౌలానా రహీముల్లా జైష్ అధిపతి మసూద్ అజార్‌కు సన్నిహితుడు. భారత వ్యతిరేక ప్రసంగాలకు ప్రసిద్ధి చెందాడు.

11) అక్రమ్ ఘాజీ లష్కర్-ఎ-తైబా మాజీ కమాండర్, ఇతడిని 2023 నవంబర్ 10న కాల్చి చంపబడ్డాడు.

12) ఖ్వాజా షాహిద్, జమ్మూలోని సుంజ్‌వాన్ ఆర్మీ శిబిరంపై జరిగిన దాడికి సూత్రధారి. 2023 నవంబర్ 6న పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తన ఇంట్లో శవమై కనిపించాడు. హత్యకు కొన్ని రోజుల ముందు ఇతడిని కిడ్నాప్ చేశారు.

13) మౌలానా జియావుర్ రెహమాన్ లష్కర్-ఎ-తైబా (LeT) ఉగ్రవాది. సెప్టెంబర్ 2023లో, కరాచీలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతడిని కాల్చి చంపారు.

14) హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఇంతియాజ్ ఆలం, 2023 ఫిబ్రవరిలో కాల్చి చంపబడ్డాడు. పాకిస్తాన్ రావల్పిండితో ఈ హత్య జరిగింది.

15)జహూర్ ఇబ్రహీం జైష్ ఉగ్రవాది. ఇతడు 2022 మార్చిలో కరాచీలో హతమయ్యాడు. 1999 నాటి కాందహార్ విమాన హైజాకింగ్, ప్రయాణికుడు రూపిన్ కత్యాల్ హత్యలో ఇతనికి ప్రమేయం ఉంది.

16)పరమ్‌జిత్ సింగ్ పంజ్‌వార్, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ (KCF) అధిపతి. ఉగ్రవాది అయిన పరమ్‌జిత్ సింగ్ పంజ్‌వార్ అలియాస్ మాలిక్ సర్దార్ సింగ్‌ను కూడా గుర్తుతెలియని దుండగులు హతమార్చారు. ఈ ఖలిస్తానీ ఉగ్రవాదిని మే 2023లో లాహోర్‌లో కాల్చి చంపారు.

17)ఖారీ ఇజాజ్ అబిద్, జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మౌలానా మసూద్ అజార్ బంధువైన ఖారీ ఇజాజ్ అబిద్‌ను 2025 ఏప్రిల్‌లో పాకిస్థాన్‌లో గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు.

18) మసూద్ అజార్‌కు అత్యంత సన్నిహితుడైన దావూద్ మాలిక్‌ను 2023లో గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు.

19) ఆమిర్ సర్ఫరాజ్, లష్కర్-ఎ-తైబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడు. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో గుర్తుతెలియని దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు.

20) ప్రపంచ ఉగ్రవాదిగా పేరున్న ఇజాజ్ అహ్మద్ అహంగర్‌ను 2023 ఫిబ్రవరిలో చంపేశారు. ఇతను భారత్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేయాలని కోరుకున్నాడు.

21) 2023 ఫిబ్రవరి 26న, అల్ బదర్ మాజీ కమాండర్ అయిన సయ్యద్ ఖాలిద్ రజా పాకిస్థాన్‌లో కాల్చి చంపబడ్డాడు.

22) అబూ ఖాసిం కాశ్మీరీగా పలిచే రియాజ్‌ను 2023లో హత్యకు గురయ్యాడు. 2023లో రావల్పిండిలో శుక్రవారం ప్రార్థనలు చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు దగ్గర నుంచి కాల్చి చంపారు. ఇతను 2023లో ఐదుగురు భారత సైనికుల్ని చంపాడు.

23) సయ్యద్ నూర్ షలోబర్, ఇతడు భారత మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉున్నాడు. 2023 మార్చి 4న ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో హత్యకు గురయ్యాడు.

24) లాల్ మహ్మద్ అనే మరో ఉగ్రవాదిని నేపాల్‌లోని కాట్మాండులో కాల్చి చంపారు. భారత్‌లో నకిలీ కరెన్సీ వ్యాపారంలో ఇతడి ప్రమేయం ఉంది.