ప్రధాని మోడీపై అమిత్‌షా ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ-కేంద్ర హోంశాఖ అమిత్‌షా ద్వయానికి గుజరాత్ రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వంలోనూ ప్రత్యేక స్థానం ఉంది.. ఆ ఇద్దరు కలిసి ఎన్నో విజయాలను అందుకున్నారు.. మోడీ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా కలిపి 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఓ టీవీ చానెల్‌తో ప్రత్యేంగా మాట్లాడిన అమిత్ షా.. ప్రధాని మోడీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను బటయపెట్టారు.. మోడీ నియంత కాదని, తనకు తెలిసిన అత్యంత ప్రజాస్వామిక నేతల్లో ఒకరని పేర్కొన్న ఆయన.. మోడీ నియంత అంటూ విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేశారు. సుదీర్ఘ కాలంగా మోడీతో కలిసి పనిచేస్తున్నాను.. ఏదైనా అంశంపై సమావేశం జరిగితే ఆయన చాలా తక్కువగా మాట్లాడతారని.. ముందుగా ఇతరులు చెప్పేది పూర్తిగా వింటారని తెలిపారు షా.
ఇక, వ్యక్తి హోదాతో సంబంధం లేకుండా ప్రధాని మోడీ సలహాలు, సూచనలు స్వీకరిస్తారని.. వారి అభిప్రాయాలు తెలుసుకుంటారని తెలిపారు అమిత్‌షా… మంచి, చెడ్డలను పూర్తిగా బేరీజు వేసుకున్న తర్వాతే మోడీ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.. అలాంటి శ్రోతను నేనెక్కడా చూడలేదంటూ మోడీపై ప్రశంసలు కురిపించిన అమిత్‌షా… ఆయనను నియంత అనడం సరికాదు.. అలా అంటున్న వారి మాటల్లో నిజం లేదన్నారు.. మరోవైపు.. నిరక్షరాస్యులు దేశానికి భారమని, వారెప్పుడూ మంచి పౌరులు కాలేరని వ్యాఖ్యానించారు అమిత్ షా. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, విధుల గురించి వారికి తెలియదని, అటువంటప్పుడు వారెలా మంచి పౌరులు కాగలరంటూ ప్రశ్నించారు. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ.. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో నిరక్షరాస్యత సమస్యను పరిష్కరించారని గుర్తుచేశారు. ప్రాథమిక పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ వంద శాతం జరగడం గుజరాత్ సీఎంగా మోడీ సాధించిన ఘనతల్లో ఒకటని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.
Also Read
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
- Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Raksha Bandhan 2026: రక్షా బంధన్ 2026 ఎప్పుడు..? రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం.. గ్రహణం ప్రభావం ఉంటుందా?
తాజావార్తలు
-
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
-
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
-
YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!