High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
- గృహ హింస కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
- కొడుకు తప్పు చేస్తే తండ్రిని బాధ్యుడిని చేయలేమని వెల్లడి
- స్పష్టమైన ఆధారాలు ఉండాలని తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ గృహ హింస కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వయోజనుడైన కొడుకు ప్రవర్తనకు అతడి తండ్రిని కేవలం తండ్రి అనే కారణంతో బాధ్యుడిని చేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. భార్యాభర్తల మధ్య వివాదంలో కొడుకు ప్రవర్తనను తండ్రి అడ్డుకోలేదన్న కారణంతో అతడిపై గృహ హింస చట్టం కింద బాధ్యత మోపలేమని తెలిపింది. ఒక వ్యక్తిపై గృహ హింసకు పాల్పడినట్లు నిర్దిష్టంగా ఆపాదించగల చర్య ఉండాలని కోర్టు పేర్కొంది.
జస్టిస్ మధు జైన్ ఆగస్టు 19, 2026న ఇచ్చిన తొమ్మిది పేజీల ఉత్తర్వుల్లో ఈ అంశాలను పరిశీలించారు. వ్యాపార వ్యవహారాల్లో జోక్యం, కార్యాలయం–ఈమెయిల్ సౌకర్యాలకు యాక్సెస్ నిరోధించడం, కుటుంబ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకుంటానని లేదా మూసివేస్తానని బెదిరించడం, అత్తింటి నుంచి వెళ్లిపోవాలని చెప్పడం వంటి ఆరోపణలు ఈ కేసులో ఉన్నాయి.
Also Read
- Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
ఈ కేసులో కోర్టు స్పష్టమైన సమాధానం ఇచ్చింది.. కేవలం వయోజనుడైన కొడుకు ప్రవర్తనను తండ్రి నియంత్రించలేదన్న కారణంతో అతడిని DV Act కింద బాధ్యుడిని చేయలేం అని తెలిపింది. తన భర్త మరో మహిళతో సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపించిన మహిళ.. తన మామ దీనిపై భర్తను నిలదీయలేదని ఫిర్యాదులో పేర్కొంది. అయితే కోర్టు పరిశీలనలో.. కొడుకు, మరో మహిళ, వారి పిల్లలకు సంబంధించిన ఓ ప్రయాణాన్ని తండ్రి వ్యతిరేకించినట్లు కూడా రికార్డులో ఉంది. అందువల్ల కొడుకు ఆరోపించిన వైవాహిక దుష్ప్రవర్తనలో తండ్రి ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు ఫిర్యాదులో కనిపించడం లేదని కోర్టు పేర్కొంది. మహిళకు, ఆమె మామకు మధ్య డొమెస్టిక్ రిలేషన్షిప్ ఉన్న విషయం వివాదాస్పదం కాదని కోర్టు తెలిపింది. అయితే ఆ సంబంధం ఒక్కటే DV Act కింద బాధ్యతను నిర్ధారించడానికి సరిపోదని ధర్మాసనం స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!