Om Birla: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్..
- భారత ప్రజాస్వామ్య విలువలను బ్రిటన్ బలంగా విశ్వసిస్తోంది..
- భారత ప్రజాస్వామ్యంపై యూకేకు బలమైన నమ్మకం ఉంది..
- ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్: ఓం బిర్లా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Om Birla: యూకే పర్యటనకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెళ్లారు. ఈ సందర్భంగా లండన్‌లోని హైకమిషన్‌లో జరిగిన సమావేశంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ.. భారతదేశ ప్రజాస్వామ్య విలువలను, వృద్ధిని యూకే బలంగా విశ్వసిస్తోందని తెలిపారు. అలాగే, ప్రముఖ బ్రిటన్ పార్లమెంటేరియన్లతోనూ మాట్లాడాను.. వారికి భారత ప్రజాస్వామ్యంపై బలమైన నమ్మకం ఉందన్నారు. అలాగే, ఇటీవల భారత్‌లో జరిగిన ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని బలోపేతం చేసేందుకు మరింత దోహదపడిందన్నారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌ను.. మాతృమూర్తిగా కీర్తిస్తున్నందుకు గర్వంగా ఉందని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.
Read Also: RRR Custodial Torture Case : ఆర్‌ఆర్‌ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక వ్యక్తి అరెస్ట్..
Also Read
- PM Modi: "మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
అలాగే, రానున్న రోజుల్లో అభివృద్ధిలో భారత్ ఇతర దేశాలను అధిగమించనుందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు వికసిత్ భారత్ కోసం తమ వంతు సహాకారం అందిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్దేశించిన ఈ లక్ష్యం దిశగా ప్రవాస భారతీయులు చేస్తున్న కృషి కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. యూకే- భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరారు. దాదాపు 17ఏళ్ల తర్వాత ఓ లోక్‌సభ స్పీకర్ యూకేలో పర్యటించడం మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా యూకే హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ లిండ్సే హోయ్‌లతో ఓం బిర్లా సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు.
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!