మహారాష్ట్ర ఎన్నికల వేళ హస్తం పార్టీకి భారీ షాక్ తగిలింది. నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న రవి రాజా.. పార్టీకి గుడ్‌బై చెప్పారు. హస్తానికి బై బై చెప్పి కమలం గూటికి చేరారు. దీపావళి పండుగను పురస్కరించుకుని గురువారం డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో రవి రాజా బీజేపీలో చేరారు.
Delhi Deputy CM Post: లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్‌పై రిలీజ్ కావడంతో ప్రస్తుతం కొత్త వాదనకు తెరలేచింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ కేబినెట్‌లో కుమారుడు ఉదయనిధికి ప్రమోషన్ అంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉదయనిధి.. డిప్యూటీ సీఎం కాబోతున్నారంటూ వార్తలు షికార్లు చేశాయి.
కర్ణాటకలో రాజకీయ దుమారం ఊపందుకుంది. ముఖ్యమంత్రిని మార్చే అవకాశం, మరో ముగ్గురు ఉపముఖ్యమంత్రుల డిమాండ్‌పై జరుగుతున్న చర్చల మధ్య.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకె శివకుమార్ శనివారం పార్టీ కార్యకర్తలు, నాయకులను ఈ అంశంపై బహిరంగ ప్రకటనలు జారీ చేయవద్దని కోరారు.
మహారాష్ట్రలోని అకోలాలో సోషల్ మీడియాలో పోస్ట్‌పై మత ఘర్షణలు చెలరేగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కొన్ని శక్తులు ప్రేరేపిస్తున్నాయి అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.