Car Crashed: బ్రేక్ కు బదులు యాక్సిలరేటర్ నొక్కాడు.. డైవింగ్ నేర్చుకుంటూ చెరువులోకి దూసుకెళ్లాడు..
- డైవింగ్ నేర్చుకుంటుండగా చెరువులోకి దూసుకెళ్లిన కారు..
- జనగామ స్థానిక బతుకమ్మ కుంట పక్కన ఉన్న గ్రౌండ్ లో వద్ద ఘటన..
- డ్రైవర్ బ్రేకు బదులు యాక్సిలరేటర్ తొక్కాడు దీంతో కారు నేరుగా చెరువులోకి దూసుకెళ్లింది..
- స్థానికుల సహాయంతో చెరువులోంచి బయటపడ్డ ఇద్దరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Car Crashed: కార్లకు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ డ్రైవింగ్ నేర్చుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొందరు కంపెనీల నుంచి నేరుగా నేర్చుకుంటే, మరికొందరు డ్రైవింగ్ స్కూల్స్ నుంచి నేర్చుకుంటారు. మరి కొందరైతే అతి తెలివి ప్రదర్శిస్తూ ఇదంతా ఎందుకు మన వద్ద కారు ఉంది కదా ఆల్రెడీ వచ్చిన వారు వెంట ఉంటే మనమే నేర్చుకోవచ్చు కదా అని భావించే వారు చాలామందే ఉన్నారు. అయితే డ్రైవింగ్ ను మీ స్వంతంగా నేర్చుకొనేటప్పుడు అజాగ్రత్తగా ఉండటం వల్ల పెద్ద ప్రమాదం ఎదుర్కొవలసి వస్తుంది. అలాంటి ఘటనే ఈరోజు జనగాంలో చోటుచేసుకుంది.
Read also: Cyberabad CP: పటాకుల దుకాణం కోసం దరఖాస్తు చేసుకోండి.. చివరి తేదీ ఎప్పుడంటే..
Also Read
జనగాం పట్టణంలోని బతుకమ్మ కుంట మైదానంలో ఓ వ్యక్తి తనకు తెలిసిన వ్యక్తితో కారు డ్రైవింగ్ చేయడం నేర్చుకుంటున్నాడు. అయితే నేర్చుకునే వ్యక్తికి తెలియని విషయం ఏంటంటే కొత్త కార్లలో పికప్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని డ్రైవింగ్ నేర్పించే వ్యక్తి.. కారు నేర్చుకుంటున్న వ్యక్తికి తెలుపకపోవడం గమనార్హం. దీంతో డ్రైవింగ్ నేర్చుకుంటున్న వ్యక్తి పికప్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. కంగారూలో బ్రేకింగ్‌కు బదులు యాక్సిలరేటర్‌ని తొక్కడంతో కారు అదుపు తప్పి ముందుకు దూసుకెళ్లింది. ఎదురుగావున్న బతుకమ్మ కుంట చెరువులోకి దూసుకెళ్లింది. చెరువులో నీరు ఎక్కువగా ఉండడంతో కారు మునిగిపోయింది. ఇద్దరు వ్యక్తులు బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా తలుపులు ఓపెన్ కాలేదు. కాగా.. స్థానికుల సూచన మేరకు డ్రైవర్ పక్కనే ఉన్న వ్యక్తి డోర్ అద్దాన్ని పగలగొట్టి నీటిలోకి దూకాడు. మరో వ్యక్తి కూడా ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటికే అప్రమత్తమైన స్థానికులు చెరువులో దూకి ఇద్దరిని బయటకు తీసుకొచ్చారు. మొత్తానికి ఈ ఘటనలో ఎవరికీ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటన తెలిసిన వారు కొందరు ఇది వినడానికి ఫన్నీగా అనిపించినా.. ఆ సంఘటన సమయంలో మనమే ఉంటే.. ఆ ఊహ ఎంత భయంకరంగా ఉంటుందని మరొకొందరు కమెంట్లు చేస్తున్నారు.
Banjara Hills: పబ్‌లో అసభ్యకరమైన నృత్యాలు.. అదుపులో 100 మంది యువకులు, 42 మంది మహిళలు..
తాజావార్తలు
-
Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో ‘సునీల్’.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
-
CM Chandrababu: ప్రతి శాఖలో సంస్కరణలు.. మోడీ సహకారం, పవన్ తోడ్పాటుతోనే.. ఇది టీమ్ స్పిరిట్
-
Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్‌లైన్.. మహిళలకు రూ.12,171 కోట్లు ఆదా!
-
Rs1 Lakh Credit: ప్రభుత్వం కొత్త పథకం.. కోటి మంది మహిళలకు రూ.1 లక్ష..!
-
Minister Anagani Satyaprasad: రెవెన్యూ సమస్యలకు చెక్.. ప్రీహోల్డ్, 22ఏ భూములపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?