Maharashtra Politics: ఉద్ధవ్‌కు మరో దెబ్బ.. ఏక్నాథ్ షిండేను కలిసిన థాక్రే సోదరుడి కుమారుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Politics: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ఎన్నికైన తర్వాత శివసేనపై పట్టు కోసం పోరాడుతున్న ఉద్ధవ్ ఠాక్రేకు ఇవాళ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేసిన తర్వాత ఉద్ధవ్ థాక్రేకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. ఈ క్రమంలోనే షిండే ఉద్ధవ్ వర్గానికి మరో షాకిచ్చాడు. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే మనువడు, ఉద్ధవ్ ఠాక్రే అన్న కుమారుడైన నిహార్ థాక్రే శుక్రవారం షిండేతో భేటీ అయ్యాడు. ఉద్ధవ్ థాక్రే సోదరుడైన దివంగత బిందుమాధవ్ థాక్రే కుమారుడైన నిహార్ థాక్రే ఇప్పటివరకు రాజకీయాల్లో పెద్దగా రాణించలేదు. కానీ ఇవాళ తిరుగుబాటు సేన నాయకుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కలుసుకుని మద్దతు ప్రకటించారు.
1996లో రోడ్డు ప్రమాదంలో మరణించిన నిహార్ థాకరే తండ్రి బిందుమాధవ్ థాక్రే, బాల్ థాక్రే ముగ్గురు కుమారులలో పెద్దవాడు. మిగిలిన ఇద్దరు జయదేవ్ థాక్రే, ఉద్ధవ్ థాక్రే. సినీ నిర్మాత అయిన బిందుమాధవ్ థాక్రే రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ బిందుమాధవ్ ఠాక్రే తనయుడు నిహార్ ఇప్పుడు సీఎం ఏక్నాథ్ షిండేతో భేటీ అయ్యారు. ఇంతకుముందు జయ్‌దేవ్ ఠాక్రే మాజీ భార్య స్మిత ఠాక్రే కూడా ఇటీవల సీఎం షిండేను కలుసుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే మినహా బాల్‌ఠాక్రే కుటుంబ సభ్యులెవరూ రాజకీయాలతో ఆసక్తి చూపేవారు కాదు. 2012లో బాల్‌ఠాక్రే మరణం తర్వాత కొన్ని వివాదాలు కొనసాగాయి. న్యాయవాది అయిన నిహార్ థాక్రే గత డిసెంబర్లో బీజేపీ నేత హర్షవర్ధన్ పాటిల్ కుమార్తె అంకితా పాటిల్‌ను వివాహం చేసుకున్నారు. హర్షవర్ధన్ పాటిల్ కాంగ్రెస్ మాజీ నాయకుడు, ఆయన చాలా సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు.
Also Read
- BJP vs Congress: మోదీ ఎక్కడికీ వెళ్లరు'.. విపక్షాల మెగా ర్యాలీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
- Ramdev on Owaisi: యూపీ ఎన్నికలపై రామ్‌దేవ్ కామెంట్స్.. ఒవైసీ పోటీపై సంచనల వ్యాఖ్యలు
- CM Vijay : రూ.30 బియ్యంపై సీఎం విజయ్‌కు షాక్
- Chandra Kumar Bose: "చరిత్రను వక్రీకరించడం నేరం".. ఫౌజీ టీజర్‌ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
Adhir Ranjan Chowdhury: ‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యలపై రాష్ట్రపతికి అధిర్ రంజన్ చౌదరి క్షమాపణలు
ఇటీవల శివసేన మౌత్ పీస్ ‘సామ్నా’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను ఉద్ధవ్ థాక్రే వెల్లడించారు. తాను గత ఏడాది అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడే తనను అధికారం నుంచి దించేయడానికి, మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఏక్ నాథ్ షిండే కుట్ర చేశారని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. “మా ప్రభుత్వం పోయింది, నా ముఖ్యమంత్రి పదవి పోయింది. అయినా నాకేమీ బాధ లేదు. కానీ నా సొంత వాళ్లే ద్రోహులుగా మారిపోయారు. నేను ఆపరేషన్ అయిన తర్వాత కోలుకుంటున్నప్పుడు వారు నా ప్రభుత్వాన్ని దించడానికి ప్రయత్నించారు” అని ఉద్ధవ్ ఠాక్రే ఇంటర్వ్యూలో అన్నారు.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..