BJP vs Congress: మోదీ ఎక్కడికీ వెళ్లరు’.. విపక్షాల మెగా ర్యాలీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
- మోదీపై ఖర్గే వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్
- నవంబర్ 1న ఢిల్లీలో ఇండియా కూటమి ర్యాలీ
- దీపావళి వేళ వ్యాపారాలకు నష్టం తప్పదంటున్న వ్యాపారులు
- ర్యాలీ వాయిదా వేయాలని కాంగ్రెస్ నేతలకు విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని రాంలీలా మైదాన్ వేదికగా నవంబర్ 1న నిర్వహించ తలపెట్టిన ‘ఇండియా’ కూటమి మెగా ర్యాలీ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణలోని (SIR) అవకతవకలపై నిరసన తెలిపేందుకు, అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో విపక్షాలు ఈ భారీ బహిరంగ సభకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టిన అధికార భారతీయ జనతా పార్టీ (BJP).. ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్ని కుట్రలు పన్నినా ఆయన పదవిలో పదిలంగా ఉంటారని స్పష్టం చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బీజేపీ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.
‘మోదీ ఎప్పటికీ ఎక్కడికీ వెళ్లరు’.. బీజేపీ ఎక్స్ వేదికగా విమర్శలు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన “మోదీ కా బాప్ భీ జాయేగా” వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ తమ అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఒక పోస్ట్ విడుదల చేసింది. “క్షమించండి.. భారత్ వ్యతిరేక శక్తులందరికీ ఒకటే చెబుతున్నాం.. మోదీ ఎప్పటికీ ఎక్కడికీ వెళ్లరు (Modi kahi nahi jayega)” అంటూ బీజేపీ స్పష్టం చేసింది. విపక్షాలు ఎన్ని ర్యాలీలు నిర్వహించినా, ఏ విధంగా ఎదురుదాడి చేసినా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసం చెక్కుచెదరదని, ఆయన తన పదవిలో కొనసాగుతారని ఆ పార్టీ తేల్చిచెప్పింది.
Also Read
- Ramdev on Owaisi: యూపీ ఎన్నికలపై రామ్‌దేవ్ కామెంట్స్.. ఒవైసీ పోటీపై సంచనల వ్యాఖ్యలు
- CM Vijay : రూ.30 బియ్యంపై సీఎం విజయ్‌కు షాక్
- Chandra Kumar Bose: "చరిత్రను వక్రీకరించడం నేరం".. ఫౌజీ టీజర్‌ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
- Tummidihatti Barrage: తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎం సానుకూల స్పందన..
దీపావళి తర్వాతే ర్యాలీ నిర్వహించండి.. వ్యాపారుల నిరసన
మరోవైపు, విపక్షాలు తలపెట్టిన ఈ మెగా ర్యాలీపై ఢిల్లీ వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండగ సీజన్ సమయంలో రాంలీలా మైదాన్ సమీపంలో ఈ ర్యాలీ నిర్వహించడం వల్ల భారీ భద్రతా ఏర్పాట్లు, రోడ్ల మూసివేత, ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని.. ఇది తమ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాపోతున్నారు. సోమవారం కాశ్మీరీ గేట్ వద్ద వ్యాపారులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. “20 వేల మంది వ్యాపారుల ఒకే ఒక విజ్ఞప్తి.. దీపావళి తర్వాతే ర్యాలీ గురించి ఆలోచించండి” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) చైర్మన్ బ్రిజేష్ గోయల్ మాట్లాడుతూ.. ఈ ర్యాలీకి సుమారు 10 లక్షల మంది హాజరవుతారనే ప్రచారం జరుగుతోందని, కానీ రాంలీలా మైదాన్ సామర్థ్యం కేవలం 50 వేలు మాత్రమేనని అన్నారు. ఈ ర్యాలీ కారణంగా చాందినీ చౌక్, సదర్ బజార్, ఖారీ బౌలి, కాశ్మీరీ గేట్ వంటి ప్రధాన హోల్‌సేల్ మార్కెట్లు పూర్తిగా స్తంభించిపోయి, కోట్ల రూపాయల వ్యాపార నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు.
వ్యాపారుల ఆందోళనపై రాహుల్ గాంధీ స్పందన
వ్యాపారులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ఎన్నికల సంఘంలోని ఓట్ల తొలగింపు వ్యవహారంపై ప్రధాని మోదీని, గ్యానేష్ కుమార్‌ను తొలగించాలని కోరితే, ఈ నిరసనలు కేవలం 30 సెకన్లలో ఆగిపోతాయని వ్యాఖ్యానించారు. మరోవైపు, సదర్ బజార్ బారీ మార్కెట్ ట్రేడ్ అసోసియేషన్ అధ్యక్షుడు పరంజీత్ సింగ్ పమ్మ కూడా పండగ సమయంలో వ్యాపారులు కోలుకోవడానికి ఈ సమయం ఎంతో కీలకమని, ర్యాలీని వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. పండగ రద్దీలో ఆంక్షలు విధిస్తే వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Thopudurthi Prakash Reddy: తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?
-
BJP vs Congress: మోదీ ఎక్కడికీ వెళ్లరు’.. విపక్షాల మెగా ర్యాలీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
-
Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
-
Ramdev on Owaisi: యూపీ ఎన్నికలపై రామ్‌దేవ్ కామెంట్స్.. ఒవైసీ పోటీపై సంచనల వ్యాఖ్యలు
-
Amit Shah : కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజేపీ పాదయాత్ర.. పాల్గొననున్న అమిత్ షా
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..