Chandra Kumar Bose: “చరిత్రను వక్రీకరించడం నేరం”.. ఫౌజీ టీజర్‌ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandra Kumar Bose: ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘ఫౌజీ’ (Fauzi) సినిమా టీజర్ ఇప్పుడు ఓ పెద్ద వివాదానికి కేంద్రబిందువుగా మారింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రను ఈ టీజర్లో చూపించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరుగుతుండగా, తాజాగా నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. “చరిత్రకు కల్పితాలను జోడించి చూపించడం నేరం” అంటూ ఆయన ‘ఫౌజీ’ మేకర్స్‌పై మండిపడ్డారు. సీతా రామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రీ-ఇండిపెండెన్స్ పీరియడ్ డ్రామాను నిర్మిస్తోంది. అయితే, ఈ టీజర్లో జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో మాట్లాడుతూ నేతాజీ పాత్ర ద్వారా ప్రభాస్ క్యారెక్టర్‌ను పొగిడించేలా సీన్లను డిజైన్ చేయడం వివాదానికి కారణమైంది. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన నేతాజీ వంటి మహానాయకుడిని, హీరో ఎలివేషన్ కోసం ఒక “సైడ్ క్యారెక్టర్”లా వాడుకోవడంపై చరిత్రకారులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదంపై స్పందించిన నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్, సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా మేకర్స్‌కు ఓ ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. చరిత్రను వక్రీకరించకుండా ఉండటానికి వెంటనే ఈ టీజర్‌ను యూట్యూబ్ నుంచి తొలగించాలని, దీని స్థానంలో కొత్త టీజర్‌ను విడుదల చేయాలని ఆయన దర్శకుడు హను రాఘవపూడిని, మైత్రీ మూవీ మేకర్స్‌ను కోరారు. ఈ విషయంలో కథానాయకుడు ప్రభాస్ కూడా దృష్టి సారించాలని ఆకాంక్షించారు. ఒకవైపు ఈ వివాదం నడుస్తుంటే, ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ చిత్రానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇది ఒక కల్పిత కథ అని, నిజమైన పాత్ర ఆధారంగా రూపొందించిన ఫిక్షనల్ డ్రామా అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ టీజర్లో ప్రభాస్‌ను “ఇండియాస్ బిగ్గెస్ట్ రెబెల్ సోల్జర్”గా పరిచయం చేశారు. అంతేకాకుండా నేతాజీ ఇచ్చిన “మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను” అనే ప్రసిద్ధ నినాదాన్ని గుర్తుచేసేలా… “అబేయ్ ఓ ఫిరంగీ.. నేను నీ రక్తం తీసుకుంటాను, ఆజాదీ కూడా లాక్కుంటాను” అంటూ ప్రభాస్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ టీజర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. వివాదాల నడుమ సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ ‘ఫౌజీ’ చిత్రాన్ని 2027 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read
- Travis Head: ట్రావిస్ హెడ్‌ను SRH కావాలనే వదిలేసిందా? అసలు ట్విస్ట్ బయటపెట్టిన టీమిండియా మాజీ కెప్టెన్..
- CM Chandrababu: కూటమి ధర్మం పాటించాం.. సీట్లు రాలేదని అలగడం ఏంటి..? బీజేపీపై చంద్రబాబు అసహనం..
- Antibiotics Misuse: జ్వరం, దగ్గు, జలుబుకు యాంటీబయోటిక్స్ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
- Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే 'కరివేపాకు పచ్చడి'.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
Mixing fiction with history is a crime. I hope @hanurpudi and his team @fauzithemovie / @MythriOfficial pull down this teaser , put out a new one and make sure that history is not distorted. Hope #Prabhas too gets to read this.
— Chandra Kumar Bose (@Chandrakbose) October 26, 2026
తాజావార్తలు
-
Travis Head: ట్రావిస్ హెడ్‌ను SRH కావాలనే వదిలేసిందా? అసలు ట్విస్ట్ బయటపెట్టిన టీమిండియా మాజీ కెప్టెన్..
-
Salman Khan-Shraddha Kapoor: శ్రద్ధా కపూర్‌కు సారీ చెప్పిన సల్మాన్.. ఇంతకీ ఏం జరిగింది?
-
Varanasi OTT Deal: ‘వారణాసి’ ఓటీటీ డీల్.. ఊహించని ధర!
-
CM Chandrababu: కూటమి ధర్మం పాటించాం.. సీట్లు రాలేదని అలగడం ఏంటి..? బీజేపీపై చంద్రబాబు అసహనం..
-
Antibiotics Misuse: జ్వరం, దగ్గు, జలుబుకు యాంటీబయోటిక్స్ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!