Bal Thackeray's grandson supports CM Ek Nath Shinde: మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్ తగిలింది. శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే మనవడు నిహార్ ఠాక్రే, సీఎం ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలిపాడు. త్వరలో జరిగే అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ముంబై ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చెప్పారు. నవంబర్ 3న జరుగుతున్న అంధేరీ ఉపఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే పార్టీ నుంచి రుతుజా లట్కేను ఉద్ధవ్…
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే ఎన్నికైన తర్వాత శివసేనపై పట్టు కోసం పోరాడుతున్న ఉద్ధవ్ ఠాక్రేకు ఇవాళ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేసిన తర్వాత ఉద్ధవ్ థాక్రేకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. ఈ క్రమంలోనే షిండే ఉద్ధవ్ వర్గానికి మరో షాకిచ్చాడు. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే మనువడు, ఉద్ధవ్ ఠాక్రే అన్న కుమారుడైన నిహార్ థాక్రే శుక్రవారం షిండేతో భేటీ అయ్యాడు.