త్రిభాషా రగడ ఇప్పుడు తమిళనాడు నుంచి మహారాష్ట్రకు మళ్లింది. త్రిభాషా విధానాన్ని ఇప్పటికే తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో మహాయతి ప్రభుత్వం 1-5 తరగతుల్లో మరాఠీ, ఆంగ్లంతో పాటు హిందీని తప్పని చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానాన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రైమరీ స్కూళ్లలో హిందీని తప్పని చేస్తూ దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) పార్టీలు తీవ్రంగా ఖండించాయి. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆ పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. జూలై 5న ఎంఎన్ఎస్, జూలై 7న వసేన (యూబీటీ) నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని ప్రకటించాయి. అయితే ఈ ఉద్యమంలో మిగతా పార్టీలను కూడా కలుపుకుంటారని ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాక్రేను విలేకర్లు అడగగా అందుకు సమ్మతించారు. విపక్ష పార్టీలను కలుపుకుని పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో తిరిగి ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే కలవబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి పోరాటానికి ఎన్‌సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ మద్దతు తెలిపారు.
ఇది కూడా చదవండి: Tourism Conclave Tech AI 2.0: ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం..!
ఇక ఈ పోరాటంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కీలక పోస్టు చేశారు. మహారాష్ట్రలోని పాఠశాలల్లో హిందీ విధించడాన్ని వ్యతిరేకంగా ఐక్యంగా మార్చ్ జరగబోతుంది. జై మహారాష్ట్ర!’’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఉద్ధవ్ థాక్రే, రాజ్ థ్రాకే ఒకే వేదికపైకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్ధవ్, రాజ్ థాక్రే కలవబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తొలుత జూలై 6న నిరసన ప్రదర్శన చేపట్టాలని ప్రకటించాయి. ఆ రోజున ఆషాఢ ఏకాదశి కారణంగా జూలై 5కి సవరించారు.
ఇది కూడా చదవండి: RAPO 23 : రూటు మార్చిన రామ్ పోతినేని.. యంగ్ దర్శకుడికి ఛాన్స్?
महाराष्ट्रतील शाळांत हिंदी सक्ती विरोधात एकच आणि एकत्र मोर्चा निघेल!
जय महाराष्ट्र! pic.twitter.com/A8ATq2ra0k— Sanjay Raut (@rautsanjay61) June 27, 2025