త్రిభాషా రగడ ఇప్పుడు తమిళనాడు నుంచి మహారాష్ట్రకు మళ్లింది. త్రిభాషా విధానాన్ని ఇప్పటికే తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో మహాయతి ప్రభుత్వం 1-5 తరగతుల్లో మరాఠీ, ఆంగ్లంతో పాటు హిందీని తప్పని చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.