Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెతుల్ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సు, కారు ముందు వైపు నుండి ఒకదానికొకటి ఢీకొట్టకున్నాయి. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతిచెందిరు. అయితే ఓ ప్రయాణికుడికి తీవ్ర గాయాలు కాగా.. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈఘటనపై బేతుల్ ఎస్పీ సిమ్లా ప్రసాద్ కు సమాచారం అందించారు. అయితే.. ఫోటోలో వున్న విధంగా చూస్తే.. బస్సు – కారు ఎదురెదురుగా ఢీకొన్నాయని అర్థం అవుతోంది. కారు ఎలా తుక్కుతుక్కు అయిందో చూడవచ్చు. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది చనిపోయారని భావిస్తున్నారు. బస్సు ముందు భాగం మాత్రమే దెబ్బతింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 11 మంది కూలీలు మహారాష్ట్రలోని అమరావతి నుంచి తిరిగి వస్తుండగా గుడ్‌గావ్ మరియు భైస్‌దేహి మధ్య ఝల్లార్ పోలీస్ స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం జరిగింది. ఎస్‌యూవీ బస్సును ఢీకొనడానికి ముందు డ్రైవర్ నిద్రమత్తులో పడిపోయాడు. ఏడు మృతదేహాలను వెంటనే బయటకు తీశామని, అయితే మిగిలిన మృతదేహాలను బయటకు తీయడానికి వాహనాన్ని చెక్కాల్సి ఉందని బేతుల్ సీనియర్ పోలీసు అధికారి సిమ్లా ప్రసాద్ తెలిపారు.
Also Read
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
Betul, Madhya Pradesh | 11 people died in a bus accident which collided with a car near Jhallar police station. One injured person has been admitted to a hospital: SP Betul Simala Prasad pic.twitter.com/aNPQmt5VIF
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) November 4, 2022
ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹ 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బెతుల్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, మరణించిన ప్రతి ఒక్కరికి తదుపరి బంధువులకు PMNRF నుండి ₹ 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుందని, క్షతగాత్రులకు ₹ 50,000 అందజేస్తాం’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Pained by the loss of lives due to an accident in Betul, MP. Condolences to the bereaved families. May the injured recover soon. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. Rs. 50,000 would be given to the injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 4, 2022
గతనెల అక్టోబర్ 21 రాత్రి మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. పండుగరోజు దీపావళికి రెండు రోజుల ముందే రేవా జిల్లాలోని సోహగి పోలీస్ స్టేషన్ పరిధిలో సోహగి పర్వతాల వద్ద బస్సు ట్రక్కు ఢీకొట్టడంతో.. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి యూపీ రాజధాని లక్నో వస్తున్న ఈ బస్సులో రోజు కూలీలు ఉన్నారు. దీంతో మధ్యప్రదేశ్‌లో వరుస ప్రమాదాలపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
PVN Madhav: తాళాలు పగులగొట్టి గోడలు దూకడం ఏంటి?
తాజావార్తలు
-
TGTET ఇన్‌సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?