Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటికీ నుంచి ‘‘సుంకాల’’ పేరుతో అనేక దేశాలను బెదిరిస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనా దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధించారు. ఇదిలా ఉంటే, భారత్‌పై కూడా పలు సందర్భాల్లో ట్రంప్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. భారత్, అమెరికా ఉత్పత్తులపై భారీగా సుంకాలను విధిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన కీలకంగా మారింది.
Read Also: MAX : కిచ్చా సుదీప్ ‘మాక్స్’.. ఫ్యాన్స్ కోసం ఓటీటీ స్పెషల్ సర్‌ప్రైజ్
మరోవైపు, మోడీతో భేటీకి ముందు ‘‘పరస్పర సుంకాలు’’ విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. సుంకాల విషయానికి వస్తే భారత్ అగ్రస్థానంలో ఉందనే దానిపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. పరస్పర సుంకాలను ప్రకటించిన తర్వాత ఓవల్ కార్యాలయంలో విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ మిత్రదేశాలు తరుచుగా శత్రువల కంటే దారుణంగా ఉంటాయి’’ అని అన్నారు. భారతదేశం చాలా ఎక్కువ సుంకాలను విధిస్తోందని, అందుకే హార్లే డేవిడ్‌సన్ బైకుల్ని భారత్‌లో అమ్మలేకపోయామని గుర్తు చేసుకున్నారు.
వైట్ హౌజ్ వేదికగా ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరిగాయి. ఆ తర్వాత జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ మోడీ ముందే సుంకాలపై తన అసహనం వ్యక్తం చేశారు. అధికా టారిఫ్‌లు వాణిజ్యానికి అడ్డంకిగా మారాయని, దీంతో ఇండియాలో వస్తువుల అమ్మకం కష్టంగా మారిందని ట్రంప్ అన్నారు. ప్రపంచంలో ఎక్కువ సుంకాలు విధించే దేశం భారత్ అని అన్నారు. అందుకే మేము కూడా ఇదే పద్ధతిని పాటిస్తామని, ఇండియా ఎంత ఛార్జ్ చేస్తుందో, మేము అంతే ఛార్జ్ చేస్తామని ట్రంప్ అన్నారు.