Siddique Murder Case: ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సిద్ధిక్ హత్య కేసు విచారణ: సీఎం షిండే..
- మహారాష్ట్రలో సంచలనంగా మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య..
- విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్న సీఎం షిండే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddique Murder Case: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత బాబా సిద్ధిక్ హత్య కేసు మహారాష్ట్రలో సంచలనంగా మారింది. శనివారం రాత్రి ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి ఆఫీస్ వద్ద బాబా సిద్ధిక్‌పై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సిద్ధిక్ మరణించారు. ఈ దాడికి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. నిందితుల్లో ఇద్దరిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు అధికార బీజేపీ కూటమిని విమర్శిస్తున్నాయి.
ఇదిలా ఉంటే సిద్ధిక్ హత్య కేసు విచారణ చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. ఈ ఘటనపై ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ విచారణ జరుపుతారని ప్రకటించారు. శాంతిభద్రతలను కాపాలని ముంబై పోలీసులను ఆదేశించామని, గ్యాంగ్ వార్ పుంజుకోవద్దని ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు.
Also Read
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
Read Also: Hamas: ఇరాన్ , హిజ్బుల్లా మద్దతు కోసం అక్టోబర్ 07 దాడి ఆలస్యం.. 9/11 తరహా దాడులకు ముందుగా ప్లాన్..
బాంద్రాలోని ఖేత్ వాడి జంక్షన్‌లో శనివారం రాత్రి వీధిలైట్లు స్విచ్ ఆఫ్ చేయడం, ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో చీకటిలోనే మాజీ మంత్రి సిద్ధిక్‌పై కాల్పులు జరిగాయి. మూడు బుల్లెట్లు బాబా సిద్ధిక్ ఛాతిలోకి దూసుకెల్లాయి. ఒక బుల్లెట్ అతనితో పాటు కారులో ఉన్న వ్యక్తి కాలికి తగిలింది. బాబా సిద్ధిక్ కారు బుల్లెట్ ఫ్రూవ్ అయినప్పటికీ బుల్లెట్స్ అద్దం గుండా ప్రవేశించాయి. దీంతో దాడి కోసం అత్యాధునిక పిస్టల్స్ వాడి ఉంటారని పోలీసు వర్గాలు తెలిపాయి.
పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు 13 రౌండ్ల 9.9 ఎంఎం డిటాచబుల్ మ్యాగజైన్‌తో ఉన్న పిస్టల్‌ని స్వాధీనం చేసుకున్నారు. బాబా సిద్ధిక్ తన కుమారుడు జీషన్ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో దాడి జరిగింది. దసరా రోజున అమ్మవారి ఉరేగింపు ఈ ప్రాంతంగా వెళ్తు్ండగా, పెద్ద ఎత్తున సంగీతం, క్రాకర్స్, బాణాసంచా శబ్ధాన్ని ఆసరాగా చేసుకుని దుండగులు సిద్ధిక్‌పై కాల్పులు జరిపారు. రెండు వారాల క్రితమే సిద్ధిక్‌కి హత్యా బెదిరింపులు రావడంతో పోలీసులు ఆయనకు వై-కేటగరి సెక్యూరిటీ ఇచ్చారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!